Fake News, Telugu
 

కేరళలోని ఆర్మీ జవాన్ తనపై ‘PFI’ కు చెందిన ఆరుగురి ముఠా దాడి చేసిందని తప్పుడు కంప్లైంట్ చేసాడు.

0

కేరళకు చెందిన ఒక ఆర్మీ జవాన్ పైన పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియాకు (PFI) చెందిన ఆరుగురు వ్యక్తులు దాడి చేసి, తన వీపు పైన ‘PFI’ అని వ్రాసారు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవముందో చూద్దాం.

క్లెయిమ్: కేరళలో ఆర్మీ జవాన్ పైన PFI కు చెందిన ఆరుగురు వ్యక్తులు దాడి చేసి అతని వీపుపై PFI అని వ్రాసారు.

ఫాక్ట్(నిజం): కేరళలోని ఆర్మీ జవాన్ తనపై ‘PFI’ కు చెందిన ఆరుగురి ముఠా దాడి చేసిందని తప్పుడు కంప్లైంట్ చేసాడు. దీని గురుంచి, అతన్ని, అతని మిత్రున్ని పోలీసులు అరెస్ట్ చేసారు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేసిన క్లెయిమ్ గురించి తెలుసుకోవడానికి కీ వర్డ్ సెర్చ్ ద్వారా ఇంటర్నెట్లో వెతకగా, దీని గురించి పలు వార్త పత్రికలు ప్రచురించటం  గమనించాం (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఆర్మీ జవాన్ షైన్ కుమార్, ఇండియన్ ఆర్మీ యొక్క ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీర్స్ (EME) కార్ప్స్‌లో పోస్ట్ చేయబడ్డాడు. కడక్కల్‌లోని తన ఇంటి పక్కనే ఉన్న రబ్బరు అడవిలో ఆరుగురు వ్యక్తుల బృందం తనపై దాడి చేసిందని షైన్ కుమార్ తెలిపారు. వారు అతని చేతులను టేప్‌తో కట్టివేసి, ఆకుపచ్చ పెయింట్‌తో అతని వీపుపై PFI అని రాశారు అంటూ షైన్ కుమార్ పోలీస్ కంప్లైంట్ చేసారు. అయితే, విచారణలో ఆర్మీ జవాన్ చేసిన ఫిర్యాదు తప్పుడు కంప్లైంట్ అని తెలిసిందని కొల్లం రూరల్‌ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్. ప్రతాపన్ నాయర్ తెలిపారు.

ఫేమస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో అతను తన స్నేహితుడితో కలిసి ఈ చర్యకు ప్లాన్ చేశారని, తప్పుడు కంప్లైంట్ చేసినందుకు షైన్ కుమార్ మరియు అతని మిత్రుడిని అదుపులోకి తీసుకున్నట్లు అదనపు SP తెలిపారని ANI ట్విట్టర్ పోస్టు ద్వారా తెలుసుకున్నాం.

చివరిగా, కేరళలోని ఆర్మీ జవాన్ తనపై ‘PFI’ కు చెందిన ఆరుగురి ముఠా దాడి చేసిందని తప్పుడు కంప్లైంట్ చేసాడు.

Share.

About Author

Comments are closed.

scroll