Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

వీడియోలోని భవనం చైనాలో కొరోనా వైరస్ రోగుల కోసం కొత్తగా కట్టిన ఆసుపత్రి భవనం కాదు

0

కొరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చైనా 19 రోజుల్లో, 57-అంతస్థుల ఆసుపత్రి ని కట్టిందని, ఆ భవన నిర్మాణానికి సంబంధించిన వీడియో అని  క్లెయిమ్ చేస్తూ  ఒక వీడియో ఫేస్బుక్ లో ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ చేసే క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కొరోనా వైరస్ సోకిన పేషంట్ల కోసం చైనా కొత్తగా 19 రోజుల్లో 57 అంతస్థుల ఆసుపత్రి నిర్మించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని వీడియో ఇంటర్నెట్లో 2018 నుండే ఉంది. కావున, పోస్ట్ లో చెప్పినట్టు ఆ వీడియోలోని భవనం కొరోనా వైరస్ సోకిన పేషంట్ల కోసం చైనా కొత్తగా నిర్మించిన ఆసుపత్రి అనే క్లెయిమ్ తప్పు. 

‘Business Insider’ వారు ప్రచురించిన ఆర్టికల్ ప్రకారం కొరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చైనా  అక్కడి పేషెంట్ల కోసం ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ ని కట్టిందని తెలిసింది. కానీ, అది  57 అంతస్థుల భవనం కాదు.

పోస్ట్ లో 57 అంతస్థుల ఆ హాస్పిటల్ని 19 రోజుల్లో కట్టారని  ఉంది. దాని ప్రకారం YouTube లో ’57 floors hospital constructed in 19 days’ అనే పదాలు ఉపయోగించి వెతికితే అదే వీడియోతో ఉన్న చాలా సెర్చ్ రిజల్ట్స్ కనిపించాయి. అందులో, ఒక యూసర్ ఆ వీడియోని మే, 2018లోనే అప్ లోడ్ చేసాడు. కానీ, ఈ విషయానికి సంబంధించిన ఏ వివరాలు ఆ వీడియోలో  లభించలేదు.

‘The Guardian’ వారు ఏప్రిల్ 30, 2015లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో, పోస్టులో షేర్ చేసిన వైరల్ వీడియో విజువల్స్ కనిపించాయి. వైరల్ వీడియోలో -1:37 నుండి -1:27 మధ్య వచ్చే విజువల్స్ ని ఆ వీడియోలో 0:00 నుండి 0:19 మధ్యలో చూడవచ్చు.  ఆ వీడియోలో హునాన్ ప్రావిన్స్ (చైనా), చాంగ్షా లో 19 రోజుల్లో, 57-అంతస్థుల భవన నిర్మాణాన్ని చూపెట్టారు. అంతేకాక, ఆ వైరల్ వీడియోలో -0:47 నుండి -0:40 మధ్య ఉన్న విజువల్స్ ని ఒక  2011 వీడియో లో (0:25 నుండి 0:32 మధ్య) చూడవచ్చు, ఆ వీడియోలో 6 రోజుల్లో నిర్మించిన ఒక 5-అంతస్థుల భవనాన్ని చూపించారు. కావున, పోస్ట్ లోని వీడియో సంబంధం లేని వేరు వేరు వీడియోలను కలిపి చేయబడింది.

చైనాలో కొరోనా వైరస్ రోగుల కోసం కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనం యొక్క వీడియోని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, పోస్టులోని  వీడియోలో చూపించింది చైనాలో కొరోనా వైరస్ రోగుల కోసం కొత్తగా  నిర్మించిన ఆసుపత్రి భవనం కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll