Fake News, Telugu
 

అమిత్ షా బోన్ కాన్సర్ తో బాధపడుతున్నాడని చెప్పేది ఫేక్ ట్వీట్

0

గత కొన్ని రోజులుగా తాను గొంతు వెనకాల వచ్చిన బోన్ కాన్సర్ తో భాధ పడుతున్నానని, ముస్లింలు తను ఆరోగ్యంగా ఉండాలని పవిత్రమైన రంజాన్ మాసంలో  ప్రార్ధన చేయాలని  అమిత్ షా  ట్వీట్  చేసాడని  క్లెయిమ్  చేస్తూ  ఆ ట్వీట్  ఫోటో సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది.  కానీ, FACTLY ఆ ట్వీట్ ఫేక్ అని తెలుసుకుంది. ‘ట్విట్టర్’  నియమాల ప్రకారం ఒక యూసర్ తన ట్వీట్ లో పోస్ట్ చేయడానికి కేవలం 280 అక్షరాలు (క్యారెక్టర్స్) మాత్రమే వాడొచ్చు. కానీ, మార్ఫ్ చేసిన ఆ ట్వీట్ లో 280 కంటే ఎక్కువ అక్షరాలు ఉన్నాయి. అంతేకాక, ఆ మార్ఫ్ చేసిన ట్వీట్ వైరల్ కావడం తో, అమిత్ షా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తాను ఏ అనారోగ్యం తో బాధ పడట్లేదని, తాను ఆరోగ్యాంగానే ఉన్నాడని స్పష్టం చేసాడు. 

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. అమిత్ షా ట్వీట్ – https://twitter.com/AmitShah/status/1259066254511362050

Did you watch our new video?

Share.

About Author

Comments are closed.

scroll