Fake News, Telugu
 

“వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు” అని అంబటి రాంబాబు అనలేదు

0

ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు సభలో మాట్లాడుతున్న వీడియోను పోస్టు చేస్తూ, “జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సారి జరిగే ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడు. ఇది అనుకొని ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్, వైకాపా భూస్థాపితం అయ్యే పరిస్థితులు వచ్చాయి అని తెలుసుకొని పక్కన ఉండటం మంచిది” అని మాట్లాడినట్టు షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవమేంటో ఇప్పుడు చూద్దాం.

ఇదే పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వైకాపా మంత్రి అంబటి రాంబాబు “జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సారి జరిగే ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడు. ఇది అనుకొని ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్, వైకాపా భూస్థాపితం అయ్యే పరిస్థితులు వచ్చాయి అని తెలుసుకొని పక్కన ఉండటం మంచిది అని మాట్లాడారు.

ఫాక్ట్(నిజం): ఇది ఎడిట్ చేసిన వీడియో. అసలు వీడియోలో అంబటి రాంబాబు, తెదేపా మరియు జనసేన ఎన్నికల ముందే తమ ఓటమిని ఒప్పుకున్నారని, వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఓడిపోతాడని, జగన్ మోహన్ రెడ్డి గెలుస్తాడని తెలిసే చంద్రబాబు కుప్పం నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది అని మాట్లాడారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వీడియో సాక్షి YouTube చానెల్లో ప్రచురించినట్టు గమనించాం. ఇది 22 ఫిబ్రవరి 2024న అంబటి రాంబాబు ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సందర్భంలోది. పూర్తి వీడియోను పరిశీలించగా, చంద్రబాబు నాయుడు ఓడిపోతాడాని, మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అవుతాడని అంబటి మాట్లాడారని తెలిసింది. అయితే, అసలు వీడియోను తెదేపాకు అనుకూలంగా భావం వచ్చేలాగా అంబటి మాట్లాడిన దాంట్లో వివిధ చోట్ల పదాలను ఎడిట్ చేసి షేర్ చేశారు అని అర్థం అయింది.

అసలు వీడియోలో అంబటి రాంబాబు, తెదేపా మరియు జనసేన ఎన్నికల ముందే తమ ఓటమిని ఒప్పుకున్నారని, వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఓడిపోతాడని, జగన్ మోహన్ రెడ్డి గెలుస్తాడని తెలిసే చంద్రబాబు కుప్పం నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది అని మాట్లాడారు. దీని గురించి మీడియా కూడా ప్రచురించింది (ఇక్కడ మరియు ఇక్కడ).

చివరిగా, “వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు” అని అంబటి రాంబాబు అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll