“దేశంలో అతిపెద్ద భీఫ్ ఎక్స్ పోర్ట్ చేసే కంపెనీ పేరు ఆల్ కబీర్, దాని ఓనర్ పేరు శ్రీ సునీల్ కపూర్” అంటూ ఈ కంపెనీ యజమాని హిందూ అని సూచిస్తూ సోషల్ మీడియాలో (ఇక్కడ మరియు ఇక్కడ) ఒక పోస్టు షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: దేశంలో అతిపెద్ద భీఫ్ ఎక్స్ పోర్ట్ చేసే కంపెనీ పేరు ఆల్ కబీర్ దాని ఓనర్ పేరు శ్రీ సునీల్ కపూర్.
ఫాక్ట్ (నిజం): అల్ కబీర్ గ్రూప్ 1970లలో సబ్బెర్వాల్ మరియు గులాం షేక్ కుటుంబాలు 50:50 భాగస్వామ్యంతో ప్రారంభించిన కంపెనీ. అతుల్ సబ్బెర్వాల్ అల్ కబీర్ గ్రూప్ యొక్క SAHAR ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్ డైరెక్టర్. ఈ కంపెనీ యొక్క గ్రూప్ విస్తరించి, గులాముద్దీన్ M. షేక్ భారతీయ కంపెనీ అల్ కబీర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని అయ్యాడు. వారి హైదరాబాద్ స్లాటర్‌హౌస్‌కు ఆసిఫ్ గులాముద్దీన్, అర్షద్ సిద్ధిఖీ డైరెక్టర్లుగా నిర్వహిస్తున్నారు. గులాముద్దీన్ కుటుంబానికి మినహా మరే ఇతర కుటుంబానికి లేదా వ్యక్తికి కంపెనీలో వాటాలు లేవు. పైగా, ఈ కంపెనీ ఆవులను, ఎడ్లను వధించదు. భారతదేశ స్థానిక చట్టాల, భారత ప్రభుత్వ ఎగుమతి విధానానికి అనుగుణంగా గేదెలను మాత్రమే వధించి, గేదె మాంసం ఎగుమతి చేస్తుంది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ పోస్టులో పేర్కొన్న ఆల్ కబీర్ అనే కంపెనీ గురించి మేము తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, 2007లో ప్రచురించబడ్డ ఎకనామిక్ టైమ్స్ కథాన్ని కనుగొన్నాము. దీని ప్రకారం, ఈ కంపెనీ 1970 కాలంలో సబ్బెర్వాల్ మరియు గులాం షేక్ కుటుంబాలు 50:50 భాగస్వామ్యంతో ప్రారంభించారు.
ఈ కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఈ గ్రూప్ పలు ఆఫీసులు, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలతో మల్టీ డైమెన్షనల్, మల్టీ ప్రోడక్ట్ బిజినెస్ గా ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందింది. ఈ కంపెనీ ఒక వివరణను ప్రచురిస్తూ, ఆల్ కబీర్ గ్రూపులో భాగమైన ఆల్ కబీర్ ఎక్స్పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ అనేది గులాముద్దీన్ M. షేక్ యాజమాన్యంలో ఉన్న మటన్ మరియు గొడ్డు మాంసం ఎగుమతి చేసే ఒక భారతీయ కంపెనీ.
ఈ కంపెనీ ఈ కంపెనీ ఆవులను, ఎడ్లను వధించదు. భారతదేశ స్థానిక చట్టాల, భారత ప్రభుత్వ ఎగుమతి విధానానికి అనుగుణంగా గేదెలను మాత్రమే వధించి, గేదె మాంసం ఎగుమతి చేస్తుంది. ఇదే సమాచారాన్ని ఈ కంపెనీ వెబ్సైటులో లింక్ చెయ్యబడ్డ “Al Kabeer Group ME” అనే యూట్యూబ్ చాన్నెల్లో ఒక వీడియో ద్వారా తెలుపబడింది. వీడియో ప్రకారం, గులాముద్దీన్ ఎం షేక్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. హైదరాబాద్ స్లాటర్‌హౌస్‌కు ఆసిఫ్ గులాముద్దీన్ మరియు అర్షద్ సిద్ధిఖీ డైరెక్టర్లుగా నిర్వహిస్తున్నారు. గులాముద్దీన్ కుటుంబానికి మినహా మరే ఇతర కుటుంబానికి లేదా వ్యక్తికి కంపెనీలో వాటాలు లేవని వీడియో పేర్కొంది. మేము అల్ కబీర్ గ్రూప్ యొక్క SAHAR ఎంటర్‌ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ సబ్‌బర్వాల్ ఇంటర్వ్యూను కూడా కనుగొన్నాము.
అలాగే, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ‘అల్ కబీర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ డైరెక్టర్లు షబ్బీర్ అమీర్ షేక్, ఆసిఫ్ గులాముద్దీన్ షేక్, అర్షద్ సలార్ సిద్ధిఖీ, కుల్దీప్ సింగ్ బ్రార్, పుష్కర్ దీపక్ ఆప్టే, అల్తాఫ్ గులాముద్దీన్ షేక్.
చివరిగా, అల్ కబీర్ ఎక్స్‌పోర్ట్స్ ఒక ముస్లిం కుటుంబానికి చెందిన కంపెనీ.