Fake News, Telugu
 

ఇటాలియన్ ఎయిర్ ఫోర్స్ వీడియోని భారత జెండా రంగులలో రఫేల్ కు ఫ్రాన్స్ ఇచ్చిన వీడ్కోలు అని షేర్ చేస్తున్నారు

0

ఫ్రాన్స్ రఫేల్ వీడ్కోలులో భాగంగా భారత దేశ జెండాలోని మూడు రంగులు ప్రదర్శించారని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ రఫేల్ వీడుకోలులో భాగంగా భారత దేశ జెండాలోని మూడు రంగులను ప్రదర్శించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో ఇటాలియన్ ఎయిర్ ఫోర్స్ రోమ్ లోని ‘Altare della Patria’ దగ్గర నిర్వహించిన ఒక ఎయిర్ షో కి సంబంధించింది. పైగా వీడియోలో కనిపించిన మూడు రంగులు ఇటలీ దేశ జెండాని సూచిస్తున్నాయి, భారత జెండాలోని మూడు రంగులను కాదు. ఈ ప్రదర్శన ఇటాలియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ‘Freece Tricolor’ (Tricolor Arrows) అనబడే ఒక ఏరోబాటిక్ టీం చేసింది. సాధారణంగా ఈ ప్రదర్శన ఇటలీ యొక్క రిపబ్లిక్ డే రోజు జరుగుతుంటుంది. ఈ వీడియోకి ఫ్రాన్స్ కి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో కి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ప్రదర్శన ఇటాలియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ‘Freece Tricolor’ (Tricolor Arrows) అనబడే ఒక ఏరోబాటిక్ టీం చేసిందని తెలిసింది. సాధారణంగా ఈ ప్రదర్శన ఇటలీ యొక్క రిపబ్లిక్ డే రోజు జరుగుతుంటుంది. ఈ ప్రదర్శనకి సంబంధించిన మరికొన్ని ఫొటోలు ఇక్కడ చూడొచ్చు. పైగా వీడియో కనిపించిన మూడు రంగులు ( గ్రీన్, వైట్, రెడ్) ఇటలీ దేశ జెండాని సూచిస్తున్నాయి, భారత జెండాలోని మూడు రంగులను కాదు.

యూట్యూబ్ లో ‘Italian Air Force Tricolori Altare della Patria’ అనే కీ వర్డ్స్ తో వెతకగా పోస్టు లో ఉన్న వీడియో లాంటివే చాలా వీడియోలు మాకు కనిపించాయి. అలాంటి ఒక వీడియో ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి పోస్టు లో షేర్ చేస్తున్న వీడియోకి ఫ్రాన్స్ మరియు రఫేల్ కి ఎటువంటి సంబంధం లేదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇటలీ జాతీయ జెండా:

ఇలాంటి వీడియోనే లండన్ లోని Trafalgar Square దగ్గర భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు అని చెప్తూ ఉన్న ఒక వార్తని FACTLY తప్పని చెప్తూ రాసిన కథనం ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ఇటాలియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఒక ఎయిర్ షో కి సంబంధించిన వీడియోని ఫ్రాన్స్ రఫేల్ వీడ్కోలులో భాగంగా భారత దేశ జెండాలోని మూడు రంగులు ప్రదర్శించిందని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll