Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఈ ‘సీరియల్ కిల్లర్’ వైద్యుడి యొక్క 125 అక్రమ కిడ్నీ మార్పిడిలకు, కోవిడ్-19 కి ఎటువంటి సంబంధం లేదు

0

కోవిడ్-19 కి సంబంధించి వైద్యానికి వచ్చిన 125 పేషెంట్ల యొక్క కిడ్నీలను తీసుకొని, వారి శవాలను మొసళ్ళకు ఆహారంగా ఒక వైద్యుడు వేసాడని చెప్తూ, ఆ వార్తకి సంబంధించిన ‘టైమ్స్ అఫ్ ఇండియా’ ఆర్టికల్ ఫోటోని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కోవిడ్-19 కి సంబంధించి వైద్యానికి వచ్చిన 125 పేషెంట్ల యొక్క కిడ్నీలను తీసుకొని, వారి శవాలను మొసళ్ళకు ఆహారంగా వేసిన వైద్యుడు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వైద్యుడి (దేవేంద్ర శర్మ) ని నిజంగానే పోలీసులు అరెస్ట్ చేసారు. అతను ఒక సీరియల్ కిల్లర్ మరియు 1994-2004 మధ్యలో సుమారు 125 మందికి అక్రమ కిడ్నీ మార్పిడి సహా వివిధ నేరాలకు పాల్పడ్డాడు. 2004 లో అరెస్ట్ అయ్యాడు. జనవరి 2020 లో పెరోల్‌ వచ్చేదాక అతను జైపూర్ జైలులో ఉన్నాడు. అయితే, తన పెరోల్‌ ముగుస్తున్నందున ఫిబ్రవరిలో పరారయ్యాడు. తరువాత, జూలై 2020 లో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు. అయితే, పోస్ట్ లో చెప్పినట్టు కోవిడ్-19 కి, తన 125 అక్రమ కిడ్నీ మర్పిడిలకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే, తను సుమారు 125 మందికి అక్రమ కిడ్నీ మర్పిడి చేసింది 1994-2004 సమయంలో; ఇప్పుడు కోవిడ్-19 సమయంలో కాదు. కావున, పోస్ట్ లో కోవిడ్-19 పేషెంట్లకు చేసినట్టు చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని ఫోటోలో ఉన్న ఆర్టికల్ గురించి వెతకగా, తాజాగా ఆ ఆర్టికల్ ని ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వారు ప్రచురించినట్టు తెలుస్తుంది. ఫోటోలోని వ్యక్తి పేరు దేవేంద్ర శర్మ అని, అతను ఒక ఆయుర్వేద వైద్యుడు అని ‘టైమ్స్ అఫ్ ఇండియా’ ఆర్టికల్ లో చదవొచ్చు. అంతేకాదు, అతను సీరియల్ కిల్లర్ అని, 1994-2004 మధ్యలో సుమారు 125 మందికి అక్రమ కిడ్నీ మార్పిడి సహా వివిధ నేరాలకు పాల్పడ్డాడని తెలుస్తుంది. 2004 లో అరెస్ట్ అయ్యాడు. జనవరి 2020 లో పెరోల్‌ వచ్చేదాక అతను జైపూర్ జైలులో ఉన్నాడు. అయితే, తన పెరోల్‌ ముగుస్తున్నందున ఫిబ్రవరిలో పరారయ్యాడు. తరువాత, జూలై 2020 లో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు. ఆ డాక్టర్ జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలకి సంబంధించిన లిస్టుని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వారి కథనంలో చూడవచ్చు. కానీ, ఆ ఆర్టికల్ లో ఎక్కడా కూడా అతని నేరాలకు కోవిడ్-19 కోణం ఉన్నట్టు రాసి లేదు.

‘1994-2004 సమయంలో 125 పైగా మందికి అక్రమ కిడ్నీ మార్పిడి చేసినట్టు, ఒక్కొక్క మార్పిడికి సుమారు 5-7 లక్షల రూపాయులు తీసుకున్నట్టు విచారణలో దేవేంద్ర శర్మ చెప్పాడు’ అని పోలీస్ అధికారులు తెలిపినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఆర్టికల్ లో చదవొచ్చు. అంతేకాదు, డాక్టర్ మరియు అతని సహచరులు టాక్సీలను బుక్ చేసి, ఏకాంత ప్రదేశంలో డ్రైవర్లను చంపేవారని, తరువాత మొసళ్ళు ఉన్న కస్గంజ్‌లోని హజారా కాలువలో మృతదేహాలను పడేసేవారని అధికారులు తెలిపారు. కావున, 125 పైగా మందికి అక్రమ కిడ్నీ మార్పిడి చేసింది కోవిడ్-19 సమయంలో కాదు. డాక్టర్ చేసిన హత్యలకు, కోవిడ్-19 కి ఎటువంటి సంబంధం లేదు. దేవేంద్ర శర్మ గురించి వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ఈ ‘సీరియల్ కిల్లర్’ వైద్యుడి యొక్క 125 అక్రమ కిడ్నీ మార్పిడిలకు, కోవిడ్-19 కి ఎటువంటి సంబంధం లేదు. తను ఆ ఆక్రమ కిడ్నీ మార్పిడిలు చేసింది 1994-2004 సమయంలో.

Share.

About Author

Comments are closed.

scroll