Fake News, Telugu
 

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌ దరఖాస్తులు ఇంకా మొదలవలేదు; ఇప్పటికే 5 కోట్ల దరఖాస్తులు వచ్చినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ ప్రారంభమైన మొదటి రోజే 5 కోట్ల దరఖాస్తులు”, అని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు​​. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ ప్రారంభమైన మొదటి రోజే 5 కోట్ల దరఖాస్తులు వచ్చాయి.

ఫాక్ట్: 20 జూన్ 2022 నాడు మొదటిగా ఇండియన్ ఆర్మీ నుండి అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రానున్నట్టు తెలిసింది. అయితే, ఈ ఆర్టికల్ రాసే సమయానికి అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి దరఖాస్తులు ఇంకా మొదలవలేదు. ఇండియన్ ఆర్మీ 20 జూన్ 2022న రిలీజ్ చేసిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం జులై 2022 నుండి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. దరఖాస్తులు మొదలవక ముందే, మొదటి రోజే 5 కోట్ల దరఖాస్తులు వచ్చినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ విషయంపై రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన ప్రతినిధి భరత్ భూషణ్ బాబు ట్వీట్ చేసారని తెలిసింది. 19 జూన్ 2022 నాడు తను ట్వీట్ చేస్తూ, 20 జూన్ 2022న మొదటిగా ఇండియన్ ఆర్మీ నుండి, 21 జూన్ 2022న ఇండియన్ నేవీ నుండి, మరియు 24 జూన్ 2022న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు రానున్నట్టు తెలిపారు.

ఇదే విషయం చెప్తూ ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు కూడా ట్వీట్ చేసారు. ఆ ట్వీట్‌ని ఇక్కడ చూడవచ్చు.

అయితే, ఈ ఆర్టికల్ రాసే సమయానికిఅగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి దరఖాస్తులు ఇంకా మొదలవలేదు. ఇండియన్ ఆర్మీ 20 జూన్ 2022న రిలీజ్ చేసిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం జులై 2022 నుండి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది.

చివరగా, అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌ దరఖాస్తులు ఇంకా మొదలవలేదు; ఇప్పటికే 5 కోట్ల దరఖాస్తులు వచ్చినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll