సాగర్ పూర్ కూరగాయల మార్కెట్ దగ్గర ‘స్పీడ్ బ్రేకర్’ నిర్మాణం చేసినందుకు అరవింద్ కేజ్రివాల్ అభినందనలు తెలిపారని, దాన్ని భారీ ఎత్తున ప్రారంభం కూడా చేశారు ఫ్లెక్సీలు కూడా కట్టారంటూ ఒక సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: స్పీడ్ బ్రేకర్ నిర్మించినందుకు అభినందనలు చెబుతున్న అరవింద్ కేజ్రివాల్ ఫోటో.
ఫాక్ట్: ఈ ఫోటోను మార్ఫ్ చేయబడింది. నవంబర్ 2020 లో రోహ్తక్ రోడ్డు పునరుద్ధరణకు అభినందనలు తెలుపుతున్న అరవింద్ కేజ్రివాల్ యొక్క ఫోటోను మార్ఫ్ చేసి స్పీడ్ బ్రేకర్ నిర్మించినందుకు అభినందనలు చెబుతున్నట్టుగా ఆడ్ చేసారు. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ ఎమ్మెల్యే శివ్ చరణ్ గోయెల్ న్యూఢిల్లీలో టేబుల్ టాప్ స్పీడ్ బ్రేకర్ ప్రారంభోత్సవాన్ని చాలా ఆర్భాటంగా ప్రచారం చేసారు, కానీ ఈ ఫోటోతో దానికి సంబంధం లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
పోస్ట్ లోని ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు 08 నవంబర్ 2020 న పబ్లిష్ చేసిన ట్విట్టర్ పోస్ట్ లో ఫోటోతో పోలి ఉన్న ఇమేజ్ లభించింది. అరవింద్ కేజ్రివాల్ యొక్క బ్యానర్లు ప్రతి 15-20 మీటర్ల దూరాన ఉన్నాయని, రోడ్డు రిపేర్ చేసినందుకు అభినందనలు ఎందుకు అని ఆ పోస్ట్ లో అన్నట్టు తెలుస్తుంది.
ఫోటోను బాగా పరిశీలించినప్పుడు అందులోని పదాలు ఒకే లైన్ లో అలైన్ అయ్యి ఉన్నట్టుగా లేదు. దాని పదాల యొక్క ఫాంట్ కూడా మ్యాచ్ అవుతున్నట్టు కనబడటంలేదు. పూర్తి ఫోటో ని చూసినప్పుడు అది లోయర్ రిసోల్యుషన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఫోటోను ట్విట్టర్ పోస్ట్ లోని ఇమేజ్ తొ పోల్చినప్పుడు ఇమేజ్ ను మార్ఫ్ చేసినట్టుగా తెలుస్తుంది.
సాగర్ పూర్ కూరగాయల మార్కెట్ దగ్గర ‘స్పీడ్ బ్రేకర్’ నిర్మాణం గురించి న్యూస్ ఆర్టికల్స్ కోసం వెతికినప్పుడు దానికి సంబంధించి ఏమీ దొరకలేదు. అదే రోహ్తక్ రోడ్డు పునరుద్ధరణకు సంబంధించి వెతికినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వారి యు యూట్యూబ్ ఛానల్ లో మరియు ఫేస్బుక్ అకౌంట్ స్టేటస్ లో అరవింద్ కేజ్రివాల్ దానికి సంబంధించి శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ ఎమ్మెల్యే శివ్ చరణ్ గోయెల్ న్యూఢిల్లీలో టేబుల్ టాప్ స్పీడ్ బ్రేకర్ ప్రారంభోత్సవాన్ని చాలా ఆర్భాటంగా ప్రచారం చేసారని, ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఢిల్లీ ఎమ్మెల్యే ట్విట్టర్ లో పంచుకున్నప్పుడు బాగా ట్రోల్ చేసారని 18 జూన్ 2021 న పబ్లిష్ చేసిన ఈ న్యూస్ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరో న్యూస్ ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు. కానీ, కేజ్రివాల్ అభినందనలు తెలుపుతున్న ఫొటోకు దీనికి సంబంధం లేదు.
చివరగా, రోడ్డు పునరుద్ధరణకు సంబంధించిన ఫోటోను మార్ఫ్ చేసి స్పీడ్ బ్రేకర్ నిర్మించినందుకు అభినందనలు తెలుపుతున్న కేజ్రివాల్ అని అంటున్నారు.