Fake News, Telugu
 

వర్షాల కారణంగా గోడ కూలిపోయి రోడ్డు చీలిపోయిన వీడియోని పెట్టి, ‘బెంగళూరులో భూకంపం’ అని షేర్ చేస్తున్నారు

0

రోడ్డు ముక్కలుగా చీలి ఉన్న ఘటనకి సంబంధించిన వీడియో ని పెట్టి, ‘బెంగళూరులో భూకంపం’ అని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ వీడియో లో రోడ్డు అనేక చోట్ల చీలిపోయి, అందులో వాహనాలు ఇరుక్కుపోయి కనిపిస్తాయి. అయితే, FACTLY విశ్లేషణ లో ఆ ఘటన 24 ఏప్రిల్ 2020 న జరిగినట్లుగా తేలింది. బెంగళూరు లోని లగ్గేరే అనే ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా గోడ కూలిపోయింది. అలాగే రోడ్డుకి పగుళ్ళు ఏర్పడి అనేక చోట్ల చీలిపోయింది. అంతే కానీ, అక్కడ భూకంపం రాలేదు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. న్యూస్ ఆర్టికల్ – https://bangaloremirror.indiatimes.com/bangalore/others/bengaluru-12-vehicles-damaged-as-road-caves-in-wall-collapses-due-to-heavy-rains/articleshow/75342855.cms
2. ANI వీడియో – https://www.youtube.com/watch?v=CHVqE0vyi3U

Did you watch our new video?

Share.

About Author

Comments are closed.

scroll