Fake News, Telugu
 

చైనాలో ఉన్న బెయిపంజియాంగ్ బ్రిడ్జి వీడియోని, కశ్మీర్‌లో NH-44 రోడ్డులో ఉన్న ఒక బ్రిడ్జి దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు.

0

జమ్మూ & కశ్మీర్ లోని NH44 రోడ్ బారాముల్ల నుండి సాంబ పోయే రూట్”లో మోదీ ప్రభుత్వం వేసిన ఒక బ్రిడ్జి దృశ్యాలని చెప్తున్న వీడియో (ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. 

క్లెయిమ్: వైరల్ వీడియోలో ఉన్న బ్రిడ్జి జమ్మూ & కశ్మీర్‌లోని NH-44 రోడ్డులో ఉంది. 

ఫ్యాక్ట్(నిజం): ఇది దక్షిణ చైనాలో ఉన్న బెయిపంజియాంగ్ బ్రిడ్జి వీడియో. దీన్ని డూజ్ బ్రిడ్జి అని కూడా అంటారు. 2018లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఈ బ్రిడ్జిని ప్రపంచంలోనే అతి ప్రపంచంలో ఎత్తైన వంతెనగా గుర్తించారు. కావున, వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను పరిశీలించడానికి, ముందుగా, అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. దీని ద్వారా వైరల్ వీడియోలో ఉన్న బ్రిడ్జి దృశ్యాలు ఉన్న ఒక ఫేస్‌బుక్ వీడియో ఒకటి దొరికింది. 

ఫ్రాన్స్ దేశంలో ఉన్న చైనీస్ ఎంబసీ వారి అఫీషియల్ వెరిఫైడ్ పేజీలో ఈ వీడియోని అప్లోడ్ చేసారు. ఈ బ్రిడ్జి చైనాలో ఉన్న బెయిపంజియాంగ్ బ్రిడ్జి అని ఈ వీడియోలో పేర్కొన్నారు. 

ఈ బ్రిడ్జ్ గురించి మరింత సమాచారం కోసం, దీని గురించి ఇంటర్నెట్లో వెతుకగా, చైనా దేశానికి చెందిన మీడియా సంస్థలైన ‘పీపుల్స్  డైలీ’ మరియు ‘న్యూ చైనా టీవీ’ వారు బెయిపంజియాంగ్ బ్రిడ్జి గురించి అప్లోడ్ చేసిన కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) మాకు దొరికాయి. సౌత్ వెస్ట్ చైనాలోని బెయిపంజియాంగ్ గ్రాండ్ వ్యాలీకి 565.4 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జి ఉందని ఇందులో వారు చెప్పారు. 

ఈ బ్రిడ్జి 2018లో ప్రపంచంలోనే ఎతైన బ్రిడ్జిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది (ఇక్కడ, ఇక్కడ).  దీన్ని డూజ్ బ్రిడ్జి అని కూడా అంటారు. ఈ బ్రిడ్జిని గూగుల్ మ్యాప్స్‌లో మీరు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, చైనా దేశంలో ఉన్న బెయిపంజియాంగ్ బ్రిడ్జి వీడియోని, కశ్మీర్‌లో NH-44 రోడ్డులో ఉన్న ఒక బ్రిడ్జి దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll