భారతదేశంలో ఉన్న ఒక లెవెల్ క్రాసింగ్ దృశ్యాలు అని షేర్ చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని డిజిటల్ ఇండియా స్థితికి ప్రతీక అని ఒక వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఉన్న లెవెల్ క్రాసింగ్ దగ్గర ఉన్న గేట్ చెక్కది. ఈ కథనం ద్వారా దీంట్లోని నిజానిజాలు తనిఖీ చేద్దాం.
క్లెయిమ్: ఈ వీడియో భారతదేశంలో ఉన్న ఒక లెవెల్ క్రాసింగ్‌కు సంబంధించినది .
ఫాక్ట్(నిజం): ఈ వీడియో నిజానికి భారతదేశంలోని లెవెల్ క్రాసింగ్‌కు సంబంధించినది కాదు, బంగ్లాదేశ్‌లోని కమిల్లా రైల్వే లెవెల్ క్రాసింగ్‌వి .కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
భారతదేశంలో చెక్కతో చేసిన లాగ్ గేట్‌తో కూడిన లెవెల్ క్రాసింగ్‌ను వీడియో చూపుతుందని వైరల్ వీడియోతో చేస్తున్న క్లెయిమ్. ఫుటేజీని నిశితంగా విశ్లేషిస్తే అది భారతదేశానికి చెందినది కాదని సూచించే చాలా లక్షణాలను బయటపరుస్తుంది. ముఖ్యంగా, వీడియోలో కనిపించే రైలు కోచ్‌లు భారతదేశంలో సాధారణంగా కనిపించే వాటికి భిన్నంగా ఉన్నాయి, ఇది ఈ వీడియో తీసిన లొకేషన్ వేరే చోట ఉందనే ప్రాథమిక క్లూని అందిస్తుంది.
వీడియో స్క్రీన్‌షాట్‌లలో ఒకదానిపై Google లెన్స్‌ని ఉపయోగించి, మేము కోచ్‌లపై ఉన్న పదాలను పరిశీలించగా, అది బెంగాలీలో ఉందని తెలిసింది. ఈ పదాలలో ఒకటి, “আন্তঃনগর” (Antahnagar), ఆంగ్లంలో “ఇంటర్‌సిటీ” అని తెలిసింది. దీన్ని బట్టి ఇది పశ్చిమ బెంగాల్ లేదా బాంగ్లాదేశ్లో తీసిన వీడియో అయ్యి ఉండవచ్చు అని తెలుస్తుంది.
అదనంగా, వీడియోలో కనబడుతున్న ఒక ఆటో-రిక్షా టాప్ కవర్ పైన “comilla.gov.bd” అనే వెబ్‌సైట్ పేరు రాసి ఉంది. కొమిల్లా బంగ్లాదేశ్‌లోని ఒక నగరమని ఇంటర్నెట్ సెర్చ్ ద్వారా తెలిసింది, దీని ద్వారా ఇది ఖచ్చితంగా భారతీయ రైల్వే క్రాసింగ్ యొక్క దృశ్యాలకు చెందినది కాదని అర్ధం అవుతోంది.
లొకేషన్‌ని నిర్ధారించడానికి, మేము Google Mapsలో సెర్చ్ చేసి కొమిల్లాలోని రైల్వే స్టేషన్ గూగుల్ స్ట్రీట్ వ్యూలో చూడగా, వైరల్ వీడియో అక్కడే తీసారని అర్ధం అయ్యింది. ఈ స్టేషన్లో తీసిన ఒక వీడియోలో, వైరల్ వీడియోలో కనిపిస్తున్న అదే రకం ట్రైన్ చూడవచ్చు.
చివరిగా, ఈ వీడియోలో ఉన్న లెవెల్ క్రాసింగ్ దృశ్యాలు బంగ్లాదేశ్లోని కమిల్లా నగరంలో తీసినవి, భారతదేశంలో కాదు.