“భారతదేశపు ముస్లింలు అదృష్టవంతులు ఎందుకంటే మీరు రంజాన్ పండగ సందర్బంగా చేసే ఉపవాసాల రోజున తినడానికి రకరకాల పండ్లు తింటూ ఆనందమైన జీవితం గడుపుతున్నారు. పాకిస్తాన్ లో తినడానికి తిండి కూడా లేదు, భారత్ శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారి చేతిలో ఉంది, కాబట్టే మీరు సంతోషంగా ఉన్నారు. ఆయనకు మా విన్నపం మా పాకిస్తాన్ మీద దాడి చేసి, పాకిస్థాన్‌ను భారతదేశంలో కలపండి” అంటూ ఒక పాకిస్తానీ యువకుడు తన గొడును వెళ్లబోసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజానిజాలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: పాకిస్తాన్‌కు చెందిన ఆసిఫ్ జర్దారీ అనబడే ఒక వ్యక్తి, పాకిస్థాన్‌లోని సమస్యలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నాడు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన కంటెంట్ క్రియేటర్, పాకిస్థానీ కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేస్తే, మేము ఇదే వీడియోను ‘bhurajrahav’ అనే వినియోగదారుడు 29 మార్చి 2024న దాన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చెయ్యటం గమనించాం. ఈ వీడియొ యొక్క ఆడియో సోర్స్ ‘dhirendra_raghav_79’ అనే వినియోగదారు నుంచి సేకరించబడినట్టు మేము కనుగొన్నాం. దీన్ని ఆధారంగా తెసుకొని ‘dhirendra_raghav_79’ ప్రొఫైల్ కోసం వెతకగా, ఇది ఒక వేరిఫైడ్ ప్రొఫైల్ అని, ఇతను ఒక ఆర్టిస్ట్ అని ఇంస్టాగ్రామ్ బయో ద్వారా తెలుసుకున్నాం. తదుపరి, వైరల్ వీడియో 23 మార్చి 2024న, “మోదీ లాంటి ప్రధాని లేరు” అనే శీర్షికతో షేర్ చేసినట్టు గమనించాం.
అతని పేజీలోని కంటెంట్‌ను పరిశీలించిన తర్వాత, చాలా వీడియోలలో అతను విభిన్న దుస్తులలో, సద్దాం హుస్సేన్, భావన వంటి విభిన్న పాత్రలను పోషిస్తు వీడియోలు చేసినట్టు మేము గమనించాము.
తదుపరి, ప్రొఫైల్‌లో అతని ఫేస్‌బుక్ పేజీకి లింక్ కూడా ఉంది, అతను ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ‘ఆర్టిస్ట్’ అని ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు.
చివరిగా, ‘ఒక పాకిస్తానీ వ్యక్తి పాకిస్థాన్‌లోని సమస్యలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నాడు’ అంటూ భారత్‌కి చెందిన ఒక కంటెంట్ క్రియేటర్ యొక్క వీడియోను షేర్ చేస్తున్నారు.