Fake News, Telugu
 

NSIGSE స్కాలర్‌షిప్ కేవలం పూర్వ విద్యార్ధినిలకు మాత్రమే కాదు, ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థినిలు కూడా అర్హులే.

0

2012-2017 మధ్య కాలంలో జడ్పిహెచ్ఎస్ /ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన SC, ST పూర్వ విద్యార్థినిలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో NSIGSE స్కీం కింద స్కాలర్ షిప్ 3000/- మంజూరు చేస్తోందని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2012-2017 మధ్య కాలంలో జడ్పిహెచ్ఎస్ /ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన SC,ST పూర్వ విద్యార్థినిలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో NSIGSE స్కీం కింద స్కాలర్ షిప్ 3000/- మంజూరు చేస్తోంది.

ఫాక్ట్(నిజం): NSIGSE స్కాలర్‌షిప్ కేవలం పూర్వ విద్యార్థినిలకు మాత్రమే కాదు. ఈ పథకంలో 8వ తరగతి పాసై 9వ తరగతి కోసం ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేసుకున్న SC / ST వర్గాలకు చెందిన బాలికలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నుండి ఎనిమిదో తరగతి పాసైన బాలికలందరూ (అన్ని సామాజిక వర్గాలకి చెందిన వారు) అర్హులు. కావున పోస్టు ద్వారా చెప్తున్నది కొంతవరకు నిజం.

పోస్టులో చెప్పిన NSIGSE స్కాలర్‌షిప్ పథకం మినిస్ట్రీ అఫ్ ఎడ్యుకేషన్ ఆద్వర్యంలో నిజంగానే ఉనప్పటికి, ఇది కేవలం పూర్వ విద్యార్థినిలకు(2012-2017) వర్తించే పథకం కాదు. ఈ పథకంలో 8వ తరగతి పాసై 9వ తరగతి కోసం ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేసుకున్న SC / ST వర్గాలకు చెందిన బాలికలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నుండి ఎనిమిదో తరగతి పాసైన బాలికలందరూ (అన్ని సామాజిక వర్గాలకి చెందిన వారు) అర్హులు. ఈ స్కాలర్‌షిప్ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇక్కడ చదవొచ్చు.

ఐతే ఈ పథకానికి సంబంధించి మరింత సమాచారం వెతికే క్రమంలో మాకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 2019లో విడుదల చేసిన సర్కులర్ ఒకటి మాకు కనిపించింది. 2012-2017 మధ్య కాలంలో 10వ తరగతి పాసై ఈ స్కాలర్‌షిప్ పథకానికి అర్హులైన విద్యార్థినిల బ్యాంకు ఎకౌంటు, ఆధార్ వివరాలు సేకరించాలని, తద్వారా ఈ పథకం కింద నగదు జమ చేయబడుతుందని ఈ సర్కులర్ లో  పేర్కొన్నారు. ఐతే ఈ సర్కులర్ ని ఆధారంగా తీసుకొని ఈ స్కాలర్‌షిప్ పథకానికి సంబంధించి అసంపూర్ణ వివరాలు పోస్టు ద్వారా ప్రచారం చేస్తునట్టు అర్ధమవుతుంది. ఈ స్కాలర్‌షిప్ పథకానికి సంబంధించి మరింత సమాచారం కింద చూడొచ్చు.

National Scheme of Incentive to Girls for Secondary Education (NSIGSE)

నేపధ్యం: 9వ తరగతిలో నమోదు చేసుకున్న విద్యార్థినిలకు ప్రోత్సాహకం అందించే ఉద్దేశంతో 2008లో కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసే ఈ పథకాన్ని ప్రారంభించింది.

లక్ష్యం: సెకండరీ స్కూల్స్ లో SC / ST వర్గాలకు చెందిన బాలికల నమోదుని ప్రోత్సహించడానికి, డ్రాప్ ఔట్ రేట్ తగ్గించి 18 సంవత్సరాల వయస్సు వరకు వారు చదువు కొనసాగించే వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం.

ప్రోత్సాహక మొత్తం: 9వ తరగతిలో నమోదు చేసుకొని అర్హులైన అవివాహిత బాలికల పేరు మీద 3000 రూపాయలు  ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేస్తారు. వీరు పదవ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 18 ఏళ్లు నిండిన తరువాత వడ్డీతో పాటు ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.

అర్హులు:

  • ఎనిమిదో తరగతి పాసై ప్రభుత్వ, ప్రభుత్వ-ఎయిడెడ్ మరియు స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతిలో నమోదు చేసుకొన్న SC / ST వర్గాలకు చెందిన బాలికలు.
  • కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నుండి ఎనిమిదో తరగతి పాసైన బాలికలందరూ (అన్ని సామాజిక వర్గాలకి చెందిన వారు అర్హులే)

దరఖాస్తు ప్రక్రియ: ఈ స్కాలర్‌షిప్ కి అర్హులైన వారు National Scholarship Portal (NSP) లో రిజిస్టర్ చేసుకొని ఈ స్కాలర్‌షిప్ కి దరఖాస్తు చేసుకోవాలి.

చివరగా, NSIGSE స్కాలర్‌షిప్ కేవలం పూర్వ విద్యార్ధినిలకు మాత్రమే కాదు.

Share.

About Author

Comments are closed.

scroll