మెదడుకు హాని కలిగించే 7 ముఖ్యమైన అలవాట్లు అని చెప్తూ ఫోటతో ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్త WHO విడుదల చేసినట్టు అర్ధం వచ్చేలా WHO లోగో కూడా ఈ ఫోటోపై ఉంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మెదడుకు హాని కలిగించే 7 ముఖ్యమైన అలవాట్ల లిస్ట్ ఒకటి WHO విడుదల చేసింది.
ఫాక్ట్(నిజం): ఇదే వార్త నైజీరియాలో వైరల్ అయినప్పుడు ఈ లిస్ట్ వారు విడుదల చేయలేదని WHO స్పష్టం చేసింది. పోస్టులో చెప్పిన అలవాట్ల వల్ల నేరుగా మెదడుకి హాని కలగకపోయినప్పటికీ , ఈ అలవాట్లు అధికంగా పాటించినప్పుడు ప్రతికూల, ప్రాణాంతక ప్రభావాలకు దారితీసే అవకాశం ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇదే వార్త నైజీరియాలో వైరల్ అయినప్పుడు ICIR వారు ఈ వార్త గురించి తెలుసుకొనే క్రమంలో WHOని సంప్రదించగా, ఈ లిస్ట్ వారు విడుదల చేయలేదని WHO స్పష్టం చేసింది. దీన్నిబట్టి ఈ లిస్ట్ కి WHOకి సంబంధం లేదని కచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా ఈ లిస్టులో ఉన్న ఒక్కొక అలవాటు గురించి వివరంగా చూద్దాం.
క్లెయిమ్ 1: Missing Breakfast
నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ (NIH) ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బ్రేక్ఫాస్ట్ తిసుకోకపోవడానికి, మెదడుకి హాని కలగడానికి ఎటువంటి సంబంధంలేదు. ఐతే బ్రేక్ఫాస్ట్ తిసుకోకపోవడం ఆకలి నియంత్రణకి దారితీయవచ్చు. ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి, డయాబెటిస్, గుండెకి సంబంధించిన వ్యాదులకు దారితీయవచ్చు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.
క్లెయిమ్ 2: Sleeping Late
హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఒక బ్లాగ్ లో నిద్రకి సంబంధించిన ఒక అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ ‘అతిగా నిద్ర పోవడం, అతి తక్కువగా నిద్రపోవడం రెండూ ప్రమాదకరం’, వీటివల్ల జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదముందని తెలిపింది. సగటున 7 గంటల నిద్ర మంచి జ్ఞాపకశక్తికి అవసరమని తెలిపింది. అలాగే ఈ బ్లాగ్ లో వేరొక అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ నిద్రలేమి వల్ల గుండె, type 2 డయాబెటిస్, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపింది.
క్లెయిమ్ 3: High Sugar Consumption
WHO ప్రకారం, మన ఆహారంలో రోజుకు 25 గ్రాముల చక్కెర అవసరం. ఎక్కువ చెక్కర తీసుకోవడం వల్ల anxiety, cognitive function లో తగ్గుదల, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలుచెపుతున్నాయి.
క్లెయిమ్ 4: More sleeping specially at morning
ఉదయం నిద్రపోవడం, మెదడు దెబ్బతినడం మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఐతే పగటిపూట నిద్ర వల్ల రాత్రి నిద్ర పట్టకపోవడానికి దారితీయవచ్చు. ఐతే రాత్రి నిద్రపోనప్పుడు, శరీరం, మెదడు దాని సహజ పునరుద్ధరణ శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది నిద్రా సమయాల్లో మార్పులకు దారితీసి స్లీప్ సైకిల్ ని దెబ్బతీస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, 10-15 నిమిషాల పవర్ నాప్ ఒక వ్యక్తి యొక్క ఉత్పాదకత, మానసిక స్థితిని పెంచుతుందని నిరూపించబడ్డాయి.
క్లెయిమ్ 5: Eating meal while watching TV or computer
హార్వర్డ్ మెడికల్ స్కూల్ యొక్క నివేదిక ప్రకారం, తినే సమయంలో పరధ్యానంగా ఉంటే అవసరం కంటే ఎక్కువ తినడానికి దారితీస్తుంది. అయితే cognitive functionకి పరధ్యానంలో ఆహారం తీసుకోవడం మధ్య ఎటువంటి సంబంధం కనుగొనబడలేదు.
క్లెయిమ్ 6: Wearing a cap or socks while sleeping
సాధారణంగా, చల్లని దేశాల్లో ప్రజలు సాక్స్‌తో నిద్రపోతారు. ఒక అధ్యయనం ప్రకారం, నిద్రపోయే సమయంలో బెడ్ సాక్స్ ఉపయోగించి పాదాలు వీడెక్కేలా చేయడం వల్ల శరీరాన్ని రిలాక్స్ చేసి నిద్ర నాణ్యతను పెంచుతుంది. ఇది చల్లని దేశాలలో ప్రయోజనకరంగా తేలింది. ఐతే ఇండియా లాంటి ట్రాపికల్ దేశంలో సాక్స్ వేసుకొని పడుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమటలు పట్టే అవకాశం ఉంది. సాక్స్ వేసుకొని పడుకోవడం వల్ల మెదడుకి హాని కలుగుతుందని ఏ రీసెర్చ్ చెప్పలేదు.
క్లెయిమ్ 7: Habit of blocking urine
మూత్రాన్ని నిరోధించడం వల్ల మెదడుకు హాని కలుగుతుందని ఎటువంటి పరిశోధనలు చెప్పలేదు. కానీ డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, ఎక్కువసేపు మూత్రం నిరోధించడం వల్ల కాలక్రమేణా మూత్రాశయ కండరాలు బలహీనపడతాయి. “Holding urine for extremely long periods of time can also cause urinary tract infections due to bacteria build-up. In addition, it can increase the risk of kidney disease and in rare cases even risk your bladder bursting, a condition that can be deadly”.
చివరగా, పైన చెప్పిన అలవాట్లు వల్ల నేరుగా మెదడుకి హాని కలగక పోయిన, ఈ అలవాట్లు అధికంగా పాటించినప్పుడు ప్రతికూల, ప్రాణాంతక ప్రభావాలకు దారితీసే అవకాశం ఉంది.