Fake News, Telugu
 

‘ఆవు తలతో పుట్టిన అతి పెద్ద చేప’ నిజమైన దృశ్యాలు అని చెప్తూ, AI వాడి తయారు చేసిన ఒక వీడియోను షేర్ చేస్తున్నారు.

0

చేప శరీరం, ఆవు తలతో ఉన్న ఒక జీవి వీడియో (ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. సముద్ర జీవులు, భూమి జంతువుల మిశ్రమంలా కనిపించే కొన్ని  జీవుల యొక్క అనేక వీడియోలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అసలు వీటి వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.  

క్లెయిమ్: ఈ వీడియో ఆవు తలతో పుట్టిన ఒక అతిపెద్ద చేపని చూపిస్తుంది.

ఫ్యాక్ట్(నిజం): ఇది AI వాడి రూపొందించిన వీడియో, నిజమైనది కాదు. కాబట్టి, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఇలాంటి విచిత్రమైన జీవిని గుర్తించినట్లు రిపోర్ట్ చేస్తూ ఎటువంటి కథనాలు, ఆధారాలు, విశ్వసనీయమైన వార్తా కథనాలు లభించలేదు. సాధారణంగా, ఇలాంటి వింత జీవిని నిజంగా ప్రజలు వీడియో తీసినట్లు అయితే, దాన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తాయి. కానీ ఒక వింతైన జీవిని ఇటీవల కనుగొన్నారు అని క్లెయిమ్ చేస్తూ షేర్ చేస్తున్న ఈ వీడియో గురించి మాత్రం ఒక్క కథనం కూడా లేకపోవడం గమనార్హం. 

అలాగే, ఈ జీవికి సంబంధించిన వేరే యాంగిల్ నుంచి తీసిన వీడియోలు ఏమైనా ఉన్నాయా అని కూడా ఇంటర్నెట్లో వెతకగా కూడా మాకేం లభించలేదు. వీడియోలో, ఈ జీవి చుట్టుతా చాలా మంది వ్యక్తులు గుమిగూడటం మనం చూడవచ్చు. వారిలో ఎవరూ ఆ జీవిని వారి యాంగిల్ నుంచి రికార్డ్ చేసి వెబ్‌లో పోస్ట్ చేయలేదంటే నమ్మడం కష్టం.

తర్వాత, వైరల్ వీడియో VXF లేదా AI ఉపయోగించి సృష్టించబడింది అనే అనుమానంతో, మేము ఫుటేజీని జాగ్రత్తగా పరిశీలించగా, AI- రూపొందించిన కంటెంట్‌లో సాధారణంగా (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) కనిపించే కొన్ని తప్పులు మాకు ఇందులో కనిపించాయి.

మీరు దగ్గరగా చూస్తే, వీడియోలో ఈ జీవి బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచున్న వారిలో, ఆకుపచ్చ బూట్లు వేసుకొన్న ఒకరు నడుస్తూ కనిపిస్తారు. అతను/ఆమె ఫ్రేమ్ యొక్క ఎడమ వైపు నుండి మధ్యకు నడుస్తారు.

వారు నడుస్తున్నప్పుడు, అకస్మాత్తుగా మరొక కాలు (మూడో కాలు) వారి బూట్ పక్కనే కనిపిస్తుంది, ఇది నిజ జీవితంలో జరగడం అసాధ్యం. మీరు దీన్ని క్రింది గ్రాఫిక్‌లో చూడవచ్చు.

అదేవిధంగా, పులి చర్మం, తలతో ఉన్న ఒక వింతైన చేప యొక్క మరొక వీడియోలో (ఇక్కడ) ఒక వ్యక్తి యొక్క బూట్లు కలిసిపోయినట్లు కనిపిస్తాయి.

ఈ వీడియోలు వైరల్ అయిన తర్వాత, చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వాటి నిజాయితీపై అనుమానం వ్యక్తం చేశారు. వన్యప్రాణుల పరిశోధకుడైన ‘ఆరోజిన్లే’ అనే ‘X’ యూజర్ ఈ వీడియోలను పోస్ట్ చేస్తూ, ఇవి ఫేక్ అని చెప్పాడు.

కొన్ని పోస్టులలో అయితే మాండరిన్ చైనీస్ భాషలో టెక్స్ట్ రాసి ఉండటం మేము గమనించాం. దీన్ని తెలుగులో ట్రాన్సల్ట్ చేస్తే, ఈ వీడియో AI ద్వారా, కేవలం వినోదం కోసం తయారు చేయబడింది అని అర్థం 

 ‘హగ్గింగ్ ఫేస్’ వారి AI-కంటెంట్ డిటెక్టర్ ‘Maybe’s AI Art Detector’ ద్వారా వైరల్ వీడియోలోని కొన్ని స్క్రీన్‌షాట్‌లను చెక్ చేస్తే, అవి 98% ఆర్టిఫీషియల్ అని ఈ డిటెక్టర్ రెస్పాన్స్ ఇచ్చింది.

ఇవన్నీ కాకుండా, ఇలా రెండు జంతువులు కలిసి అనేక వింతైన జీవులకి చెందిన అనేక వీడియోలను పోస్ట్ చేసిన కొందరు ‘డిజిటల్ క్రియేటర్స్’ యొక్క కొన్ని Facebook ప్రొఫైల్‌లు కూడా మాకు దొరికాయి.వాటిని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఈ ఆధారాల బట్టి, ‘టెక్స్ట్ టు వీడియో’ AI టూల్స్ ఉపయోగించి రూపొందించబడిన వీడియోలని నిజమైన వింత జంతువుల వీడియోలుగా తప్పుగా షేర్ చేస్తున్నారు అని మనం స్పష్టంగా నిర్ధారించుకోవచ్చు.

చివరిగా,  ఆవు తలతో పుట్టిన జీవి యొక్క  నిజమైన దృశ్యాలు అని చెప్తూ, ఒక  AI వాడి తయారు చేసిన వీడియోని  షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll