Fake News, Telugu
 

ఒక వ్యక్తి ఓ ఇంట్లో నుంచి ముగ్గురు మహిళలను రక్షించినట్లు చూపించే స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన లవ్ జిహాద్ ఘటనగా షేర్ చేస్తున్నారు

0

సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఓ ఇంట్లో నుంచి ముగ్గురు మహిళలను రక్షించినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ). ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేసి బంధించారు అని చెప్పుతూ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేసి బంధించినట్లు చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోను నవీన్ జాంగ్రా అనే వీడియో క్రియేటర్ తన యూట్యూబ్ ఛానల్‌లో 12 అక్టోబర్ 2023న అప్లోడ్ చేశారు. కావున, వైరల్ పోస్టులలో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ అవుతున్న వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు,ఈ వీడియో యొక్క అసలు (పూర్తి) వెర్షన్ (ఆర్కైవ్డ్ లింక్) మాకు దొరికింది. ఈ వీడియోను ‘నవీన్ జాంగ్రా’ అనే యూట్యూబ్ ఛానెల్ 12 అక్టోబర్ 2023న అప్లోడ్ చేసినట్లు మాకు తెలిసింది. ఇది ఒక వెరిఫైడ్ యూట్యూబ్ ఛానెల్.

ఈ వీడియోలో 0:21 టైమ్-స్టాంప్ దగ్గర ఒక వివరణ ఉంది. ఇందులో, ఈ వీడియోని వినోదం కోసం తయారు చేశారు అని చెప్పారు. అంటే, ఈ వీడియోలో చూపిస్తున్న సంఘటన నిజంగా జరగలేదని, అది కేవలం యాక్టింగ్ మాత్రమే అని స్పష్టం అయింది.

అలాగే, ఈ యూట్యూబ్ ఛానెల్ అబౌట్ సెక్షన్‌లో నవీన్ జాంగ్రా యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మాకు దొరికింది. తన పేజీ యొక్క బయోలో, తను ఒక వీడియో క్రియేటర్ అని రాసి ఉంది.

అదనంగా, నవీన్ జాంగ్రా తన యూట్యూబ్ ఛానల్‌లో చాలా స్క్రిప్టెడ్ వీడియోలను అప్లోడ్ చేశారు. ఆయన ఇటువంటి వీడియోలు తయారు చేసి రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఈ యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేసిన మరొక వీడియోలో కూడా ఆయనను మనం చూడవచ్చు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

చివరిగా, ఒక వ్యక్తి ఓ ఇంట్లో నుంచి ముగ్గురు మహిళలను రక్షించినట్లు చూపించే స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన లవ్ జిహాద్ ఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll