Fake News, Telugu
 

ఒక వృద్ధ ముస్లిం మౌలానా హిందూ మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని పేర్కొంటూ ఒక స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా షేర్ చేస్తున్నారు

0

“దర్గాల్లో జరుగుతున్న దురాగతాలు, సంతానం కలగలేదని ఒక హిందూ మహిళ ఒక వృద్ధ ముస్లిం మౌలానా వద్దకు వెళ్ళినప్పుడు, అతను ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ఈ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక హిందూ మహిళ  సంతానం కలగలేదని ఒక వృద్ధ ముస్లిం మౌలానా వద్దకు వెళ్ళినప్పుడు, అతను ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వైరల్ వీడియో యొక్క అధిక/పూర్తి నిడివి గల వీడియోలో, ‘ఈ వీడియోలో చూపించేది నిజమైన సంఘటన కాదు, కేవలం ఊహాత్మకమైనది (అంటే కల్పితం)’ అని వివరణ (Disclaimer) ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, షేక్ అస్లాం అనే  ఫేస్‌బుక్ యూజర్ 12 సెప్టెంబర్ 2022న ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఇవే దృశ్యాలు కలిగిన అధిక నిడివి గల వీడియో (ఆర్కైవ్డ్) లభించింది. ఈ వీడియోను మనం జాగ్రతగా పరిశీలిస్తే టైంస్టాంప్ 11.50 వద్ద, ‘ఈ వీడియోలో చూపించేది నిజమైన సంఘటన కాదు, కేవలం ఊహాత్మకమైనది (అంటే కల్పితం)’ అని ఒక వివరణ (Disclaimer) ఉండటం మనం గమనించవచ్చు. దీన్ని బట్టి, ఈ వీడియోలోని సంఘటన నిజంగా జరగలేదని మనం నిర్ధారించవచ్చు.

అలాగే ఈ వైరల్ వీడియోలో వృద్ధ ముస్లిం మౌలానా (మత పెద్ద) పాత్ర పోషించిన వ్యక్తి నటించిన మరిన్ని  స్క్రిప్టెడ్ వీడియోను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

ఇంతకముందు కూడా ఇలాంటి పలు స్క్రిప్టెడ్ వీడియోలు నిజమైన ఘటనలుగా సోషల్ మీడియాలో వైరల్ కాగా, వాటిని ఫాక్ట్–చెక్ చేస్తూ Factly రాసిన కథనాలను ఇక్కడ,  ఇక్కడఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఒక స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తూ, ఒక వృద్ధ ముస్లిం మౌలానా (మత పెద్ద) హిందూ మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll