Fake News, Telugu
 

2023లో నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా మోదీ కొందరు మఠాధిపతులతో దిగిన ఫోటోని సైన్స్ డే నాటి ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

0

నెహ్రూ, సర్దార్ పటేల్, అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్ వంటి దిగ్గజాలు కలిసి దిగిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో పాటు ప్రధాని మోదీ కొందరు సాధువులతో కలిసి దిగిన ఫోటోల కొలాజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రెండు ఫోటోలు సైన్స్ డే సమయంలో దిగినవని, ఆనాటి సైన్స్ డే ఫోటోలో ‘అంబేద్కర్ గారు, నెహ్రూ గారు మేధావులు, శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు.’ ఈనాడేమో ‘సన్యాసి + సన్యాసులు = మిగిలింది బూడిద’ అని క్లెయిమ్ చేస్తూ ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: నెహ్రూ కాలం నాటి సైన్స్ డే ఫోటోలో నెహ్రూ, సర్దార్ పటేల్, అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్ వంటి దిగ్గజాలు ఉంటే, ఈ కాలం నాటి నరేంద్ర మోదీ ఫోటోలో మాత్రం సన్యాసులు ఉన్నారు. 

ఫాక్ట్(నిజం): ప్రధాని మోదీ సాధువులతో ఉన్న ఫోటో సైన్స్ డే నాడు దిగినది కాదు.  ఇది మే 2023లో నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా కొందరు మఠాధిపతులు మోదీని కలిసి పవిత్ర రాజదండమైన ‘సెంగోల్’ అందజేసినప్పుడు దిగిన ఫోటో. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ ఫోటోల సందర్భాలను తెలుసుకోవడానికి వాటిని వేరువేరుగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మొదటి ఫోటో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైటులో దొరికింది. ఈ ఫోటో వివరణలో ఇది జనవరి 1950 నాటిదని, ఇందులో ఉన్నవారు అప్పటి భారత దేశ క్యాబినెట్ మంత్రులని ఉంది(ఇక్కడ, ఇక్కడ). 

ప్రధాని మోదీ సాధువులతో ఉన్న ఫోటో మే 2023 నాటిది అని మా సెర్చ్ ద్వారా మేము తెలుసుకున్నాము

2023 మే నెలలో ప్రధాని మోదీని కొందరు మఠాధిపతులు (పూజారులు) కలిసి ‘సెంగోల్’(పవిత్ర రాజదండము) అందజేశారు. నూతన పార్లమెంట్ భవనం యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా దీన్ని వారు అందజేశారు అని కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి(ఇక్కడ, ఇక్కడ ). 

మోదీ కూడా తన X (గతంలో ట్విట్టర్)లో 27 మే 2023 నాడు ఈ ఫోటోని పోస్టు చేశారు. ఈ ఫోటో యొక్క క్రాప్ చేసిన వెర్షన్ వైరల్ అవుతున్న ఫోటో.

27 మే మన నేషనల్ సైన్స్ డే కాదు. ప్రతి సంవత్సరం మన దేశంలో 28 ఫిబ్రవరిని నేషనల్ సైన్స్ డే గా జరుపుకుంటారు. ఈ ఏడాది నేషనల్ సైన్స్ డే నాడు, మన దేశ సైంటిఫిక్ టెంపెరిమెంట్, టెక్నాలజీ ఇంకా సైంటిఫిక్ స్పిరిట్ గురించి మొత్తం ప్రపంచం గుర్తించింది అని చెప్తూ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ కూడా చేశారు. 

చివరగా, 2023లో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కొందరు మఠాధిపతులతో మోదీ దిగిన ఫోటోని సైన్స్ డే నాడు దిగిన ఫోటో అని తప్పుగా షర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll