భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 26 డిసెంబర్ 2024న ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఒక వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ, ఇది మన్మోహన్ సింగ్ చివరి ఫొటో అని ప్రచారం చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఇందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరి క్షణాల్లో తీసిన ఫొటో.
ఫాక్ట్(నిజం): ఈ ఫోటో డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరి క్షణాల్లో తీసినది కాదు. 14 అక్టోబర్ 2021న మన్మోహన్ సింగ్ AIIMSలో చికిత్స పొందుతున్న సమయంలో, అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వారిని పరామర్శించి ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకున్నప్పుడు తీసిన ఫోటో ఇది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన అక్టోబర్ 2021 నాటి ఇండియా టీవీ కథనం(ఆర్కైవ్ లింక్) మాకు లభించింది. ఈ కథనంలో అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఒక వైద్యుడితో ఉన్నట్లు ఫోటోలో కనిపిస్తుంది. 14 అక్టోబర్ 2021న డాక్టర్ మన్మోహన్ సింగ్ AIIMSలో చికిత్స పొందుతున్న సమయంలో, మాండవియా వారిని పరామర్శించడానికి వెళ్లినప్పుడు తీసిన ఫోటో ఇది.
ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, అక్టోబర్ 2021లో ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, జ్వరంతో బాధపడుతూ ఎయిమ్స్ చేరిన మన్మోహన్ సింగ్‌ను మాండవియా 14 అక్టోబర్ 2021న కలసి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు.
అక్టోబర్ 2021 తర్వాత, డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలు మరియు వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, అక్టోబర్ 2021 నాటి ఫోటోను మన్మోహన్ సింగ్ చివరి క్షణాల్లో తీసిన ఫోటోగా షేర్ చేస్తున్నారు