నీట మునిగి చనిపోయిన వ్యక్తి శరీరానికి ఉప్పు కప్పి బ్రతికించవచ్చు అని చెప్తున పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ యొక్క నిజం గురించి ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: నీటిలో మునిగి చనిపోయిన వ్యక్తి శరీరాన్ని ఉప్పుతో కప్పడం ద్వారా తిరిగి బ్రతికించవచ్చు.
ఫాక్ట్ (నిజం): ముందుగా దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. నీటిలో మునిగిన వ్యక్తులకు సూచించబడిన చికిత్సలలో ఎక్కడా శరీరాన్ని ఉప్పుతో కప్పి ఉంచడం అనే ప్రక్రియ లేదు. నీటిలో మునిగి చనిపోయిన వ్యక్తులను మూఢనమ్మకాలతో ఉప్పుతో కప్పిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. అయితే, వారిలో ఒక్కరు కూడా తిరిగి జీవం పోసుకోలేదు. అందువల్ల పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ కి సంబంధించి ఏదైనా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా అని ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినప్పుడు, మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. మునిగిపోయిన వ్యక్తులకు సూచించబడిన చికిత్సలలో ఎక్కడా కూడా శరీరాన్ని ఉప్పుతో కప్పి ఉంచడం లేదు. మునిగిపోయిన వ్యక్తులకు చికిత్స చేయడానికి సూచించిన కొన్ని పద్ధతులు మరియు ప్రక్రియలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
నీటిలో మునిగి చనిపోయిన వ్యక్తులను బ్రతికించటానికి ,మూఢనమ్మకాలతో ఉప్పుతో కప్పిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. అయితే, వారిలో ఒక్కరు కూడా తిరిగి బతకలేదు. వాటికి సంబంధించిన కొన్ని వార్తా నివేదికలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, నీటిలో మునిగి చనిపోయిన వ్యక్తిని ఉప్పుతో కప్పడం ద్వారా తిరిగి బ్రతికించలేము.