Fake News, Telugu
 

వీధుల్లోకి వచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని CJI చంద్రచూడ్ ప్రజలను ప్రోత్సహించారని ఒక ఫేక్ ప్రకటన షేర్ చేస్తున్నారు

0

వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేలా ప్రజలను ప్రోత్సహిస్తూ Chief Justice of India(CJI) డీ.వై.చంద్రచూడ్ ఒక ప్రకటన చేసారని చెప్తున్న మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. CJI చంద్రచూడ్‌ అన్నారని చెప్తున్న ప్రకటన ఇలా ఉంది- “ మేము భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము, అయితే మీ సహకారం దీనికి కూడా చాలా ముఖ్యం, ప్రజలంతా ఏకమై వీధుల్లోకి వచ్చి తమ హక్కుల గురించి ప్రభుత్వాన్ని అడగాలి, ఈ నియంతృత్వ ప్రభుత్వం. ప్రజలను భయపెడతారు, బెదిరిస్తారు, కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి మరియు ప్రభుత్వాన్ని లెక్క అడగండి, నేను మీతో ఉన్నాను “ పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాల్ని ఈ ఆర్టికల్ ద్వారా వెరిఫై చేద్దాం.

క్లెయిమ్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ప్రజలను ప్రోత్సహిస్తూ CJI చంద్రచూడ్ ఒక  ప్రకటన చేసారు.

ఫాక్ట్(నిజం): వైరల్ పోస్ట్ ఫేక్ అని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ (PRO) ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అటువంటి పోస్ట్ ఏదీ CJI జారీ చేయలేదని సుప్రీంకోర్టు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని కోరుతూ CJI DY చంద్రచూడ్ అటువంటి ప్రకటన ఏదైనా చేసారా అని ఇంటర్నెట్‌లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతికినప్పుడు, ఈ వైరల్ ప్రకటనకు సంబంధించి ‘లైవ్ లా’ ప్రచురించిన ట్వీట్‌ని మేము కనుగొన్నాము. ఆ ట్వీట్‌లో, “భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పుడుగా ఉటంకిస్తూ(Quote(కోట్) చేస్తూ) సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తికి సంబంధించి #సుప్రీంకోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో న్యాయ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.” అని ఉంది. 

ఈ ట్వీటులో ‘లైవ్ లా’ CJIకి తప్పుగా ఆపాదించబడిన ఈ కల్పిత ప్రకటనకు సంబంధించి సుప్రీంకోర్టు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ (PRO) జారీ చేసిన ప్రెస్ నోట్‌ను షేర్ చేసింది. వైరల్ కోట్(Quote) CJIకి తప్పుగా ఆపాదించబడిందని ధృవీకరిస్తూ, ప్రెస్ నోట్ ఇలా పేర్కొంది- “ఈ పోస్ట్ ఫేక్, దురుద్దేశపూరితమైన మరియు అల్లరి పనిలాగా ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తి అటువంటి పోస్టు చెయ్యలేదు లేదా అటువంటి పోస్టు చెయ్యటానికి అధికారం కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు. ఈ విషయంలో న్యాయ అధికారుల ద్వారా తగిన చర్యలు తీసుకోబడుతున్నాయి.”

సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ వివరణను రిపోర్టు చేస్తూ పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. వాటిలో కొన్నిటిని  ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలపాలని CJI చంద్రచూడ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. 

Share.

About Author

Comments are closed.

scroll