Fake News, Telugu
 

24 మంది పిల్లల్ని కన్న ఒక నిజమైన మహిళ అని ఒక కట్టు కథని షేర్ చేస్తున్నారు, ఈమెకి నిజానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

0

23 సంవత్సరాల వయసులో 24 మంది పిల్లల్ని కన్న ఒక ‘సంతాన లక్ష్మి’ అని చెప్తూ, సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వివరిస్తున్న ఒక మహిళకు (ఖుష్బూ పాఠక్) చెందిన ఇంటర్వ్యూ క్లిప్(ఇక్కడ, ఇక్కడ) ఒకటి చలామణి అవుతోంది. వైరల్ క్లెయిమ్ ప్రకారం ఈమెకి 16వ ఏట పెళ్లి అయింది, 8 సార్లు తనకు కవల పిల్లలు పుట్టారు, మిగతా ఎనిమిది మంది ఒక్కొక్కరిగా జన్మించారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: వైరల్ వీడియోలో ఉన్న మహిళ ఖుష్బూ పాఠక్, 23 సంవత్సరాలలో 24 మంది పిల్లల్ని కన్నారు. 

ఫ్యాక్ట్(నిజం): ఖుష్బూ పాఠక్ స్క్రిప్టెడ్ కామెడీ వీడియోలలో నటిస్తారు. వైరల్ వీడియోలో చెప్తున్నది అంతా ఒక కట్టు కథ అని, నిజానికి తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని తను మీడియాకి స్పష్టం చేశారు. కాబట్టి వైరల్ అవుతున్న ఈ క్లెయిమ్ తప్పు

వైరల్ వీడియో వేనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతుకగా, వైరల్ వీడియోలో ఉన్న మహిళ ‘PG News’ అనే యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి దొరికింది. వైరల్ వీడియో, ఈ వీడియోలో ఒక క్లిప్ మాత్రమే. ఇందులో తాను, తన పేరు ఖుష్బూ పాఠక్ అని, తనకు 24 మంది పిల్లలు ఉన్నారు అని చెప్పడం మనం చూడవచ్చు. 

కాకపోతే, నిజానికి ఇదంతా కేవలం కల్పితమే అని, తను వేరే వార్తా సంస్థలతో ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పింది. ‘News 24’ తో మాట్లాడుతూ, ఖుష్బూ పాఠక్, తను కామెడీ వీడియోలలో నటిస్తారు అని, వైరల్ వీడియోలో చెప్పింది అంతా కేవలం కల్పితమే(స్క్రిప్టెడ్) అని చెప్పారు, నిజానికి తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

ఇదంతా తను కేవలం వినోదం కోసం మాత్రమే చేశామని అని స్పష్టం చేసారు. ఇదే విషయాన్ని గురించి ఖుష్బూ, ఆజ్ తక్ మరియు అనేక మీడియా సంస్థలకి క్లారిటీ ఇచ్చారు.

కొన్ని ఇంటర్వ్యూలలో అయితే తన ఇద్దరు పిల్లలతో పాటు తను 22 మొక్కలని పెంచుతున్నాను అని చెప్పారు, మొత్తం కలిపి తనకు 24 పిల్లలు అని చెప్పారు. ఇదే విషయాన్ని ఖుష్బూ తన వ్లాగ్ ఛానల్‌లో కూడా చెప్పారు

ఖుష్బూ తన టీంతో కలిసి ‘apna aj’ అనే యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు చేస్తుంటారు, వీటిని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, వినోదం కోసం చిత్రించిన ఒక స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తూ, నిజంగానే వీడియోలో ఉన్న మహిళ 24 మంది పిల్లల్ని కనింది అని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll