“హిందూ సంస్కృతి ఉత్కృష్టమైనది. హిందువులు గొప్పవారు” అని కెనడాలోని అల్బెర్టా రాష్ట్రం యొక్క స్కూల్ సిలబస్‌లో చేర్చినట్టు ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హిందూ సంస్కృతిని గురించి కూడా చేర్చినట్టు పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: “హిందూ సంస్కృతి ఉత్కృష్టమైనది. హిందువులు గొప్పవారు” అని కెనడాలోని అల్బెర్టా రాష్ట్రం యొక్క స్కూల్ సిలబస్‌లో చేర్చారు.
ఫాక్ట్: “హిందూ సంస్కృతి ఉత్కృష్టమైనది. హిందువులు గొప్పవారు” అని కెనడాలోని అల్బెర్టా రాష్ట్రం యొక్క స్కూల్ సిలబస్‌లో చేర్చారని మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కెనడాలోని అల్బెర్టా రాష్ట్రము ఇటీవల కిండర్ గార్టెన్ (ఆరు సంవత్సరములలోపు పిల్లల కొరకు ఉద్దేశించిన పాఠశాల) నుండి ఆరవ తరగతి వరకు కొత్త ముసాయిదా సిలబస్ (Draft K-6 Curriculum) విడుదల చేసింది. ఇందులో అన్ని మతాల గురుంచి, వాటి చరిత్ర గురుంచి పెట్టారు. 2వ తరగతి సిలబస్ లో ఏకేశ్వరోపాసన (దేవుడు ఒకడే ఉన్నాడనే సిద్ధాంతము) పాటించే మతాలు ఇస్లాం, క్రిస్టియానిటీ, జుడాయిజం గురుంచి పరిచయం చేస్తారు. 6వ తరగతి సిలబస్ లో హిందూ, సిక్కు, బౌద్ధ మతాల గురుంచి, అల్బెర్టా రాష్ట్రంలో నివసిస్తున్న వివిధ మతాల గురుంచి చెప్తారు. Draft K-6 Curriculum కేవలం హిందూ మతం కోసం పెట్టింది కాదు. హిందూ మతం గురుంచి కూడా 2వ తరగతిలోనే చెప్పాలని అక్కడి కొంత మంది హిందువులు గతంలో డిమాండ్ చేసారు. కానీ, ఇది ఇంకా కాలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
కెనడాలోని అల్బెర్టా రాష్ట్రము ఇటీవల కిండర్ గార్టెన్ (ఆరు సంవత్సరములలోపు పిల్లల కొరకు ఉద్దేశించిన పాఠశాల) నుండి ఆరవ తరగతి వరకు కొత్త ముసాయిదా సిలబస్ విడుదల చేసింది. దీనిని Draft K-6 Curriculum అని అంటారు; ఇది 2022-23 సంవత్సరం నుండి వాడుకలోకి వస్తుందని వారి వెబ్సైటులో తెలిపారు.
ఈ కొత్త సిలబస్‌లో (సోషల్ స్టడీస్) అన్ని మతాల గురుంచి, వాటి చరిత్ర గురుంచి పెట్టారు. 2వ తరగతి సిలబస్‌లో ఏకేశ్వరోపాసన (దేవుడు ఒకడే ఉన్నాడనే సిద్ధాంతము) పాటించే మతాలు ఇస్లాం, క్రిస్టియానిటీ, జుడాయిజం గురుంచి పరిచయం చేస్తారు. 6వ తరగతి సిలబస్‌లో హిందూ, సిక్కు, బౌద్ధ మతాల గురుంచి, అల్బెర్టా రాష్ట్రంలో నివసిస్తున్న వివిధ మతాల గురుంచి చెప్తారు.
“హిందూ సంస్కృతి ఉత్కృష్టమైనది. హిందువులు గొప్పవారు” అని కెనడాలోని అల్బెర్టా రాష్ట్రం యొక్క స్కూల్ సిలబస్‌లో చేర్చలేదు. అన్ని మతాల గురుంచి, వారి చరిత్ర గురుంచి చెప్పినట్టే, హిందూ మతం చరిత్ర, పవిత్ర గ్రంథాలు, ముఖ్యమైన బోధనలు మొదలైనవి ఈ సిలబస్ లో ఉన్నాయి.
Draft K-6 Curriculum కేవలం హిందూ మతం కోసం పెట్టింది కాదు. హిందూ మతం గురుంచి కూడా 2వ తరగతిలోనే చెప్పాలని అక్కడి కొంత మంది హిందువులు గతంలో డిమాండ్ చేసారు. కానీ, ఇది ఇంకా కాలేదు.
చివరగా, “హిందూ సంస్కృతి ఉత్కృష్టమైనది. హిందువులు గొప్పవారు” అని కెనడాలోని అల్బెర్టా రాష్ట్రం యొక్క స్కూల్ సిలబస్‌లో చేర్చలేదు.