Fake News, Telugu
 

మహేష్ బాబు వైకాపాలో చేరుతున్నాడని ఒక నకిలీ ‘way2news’ పోస్టుని షేర్ చేస్తున్నారు

0

ప్రముఖ సినీనటుడు మహేష్ బాబు 02 సెప్టెంబర్ 2023న  వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని ‘way2news’ సంస్థ లోగో కలిగి ఉన్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: మహేష్ బాబు 02 సెప్టెంబర్ 2023న  వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని ‘way2news’ ప్రచురించిన కథనం యొక్క ఫోటో.

ఫాక్ట్: ‘way2news’ ఈ వార్తను ప్రచురించలేదని స్పష్టం చేసింది. మహేష్ బాబు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా ఈ విషయంపై ఇంటర్నెట్లో వెతకగా, తాము ఈ కథనాన్ని ప్రచురించలేదని ‘way2news’ తమ ఫాక్ట్-చెక్ ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేయడం గుర్తించాం. తమ సంస్థ లోగోని వాడుకొని కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆ సంస్థ వెల్లడించింది.

పైగా, తను వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మహేష్ బాబు స్వయంగా కానీ, మీడియా ముఖంగా కానీ ఇప్పటివరకు చెప్పలేదు.

చివరిగా, మహేష్ బాబు 02 సెప్టెంబర్ 2023న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని చెప్తూ ప్రచారంలో ఉన్న ‘way2news’ పోస్టు నకిలీదని ఆ సంస్థ స్పష్టం చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll