Fake News, Telugu
 

‘జీయూస్ అండ్ రోక్సాన్’ అనే సినిమాలోని క్లిప్‌ని షేర్ చేస్తూ ఒక కుక్కని సొరచేపల నుంచి కాపాడిన ఓ డాల్ఫిన్ దృశ్యాలని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు.

0

సముద్రంలో ఈదుతున్న ఒక కుక్కను సొరచేపల బారిన పడకుండా ఒక డాల్ఫిన్ కాపాడుతున్న వీడియో(ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఎంతో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: సముద్రంలో ఈదుతున్న కుక్కను సొరచేపల నుంచి ఒక డాల్ఫిన్ రక్షించిన నిజమైన సంఘటనకి చెందిన వీడియో.

ఫ్యాక్ట్(నిజం):  ఈ వీడియో క్లిప్ నిజానికి ‘జీయూస్ అండ్ రోక్సాన్ అనే ఒక హాలీవుడ్ సినిమాకి చెందినది. ఈ సినిమా 1997లో విడుదలైంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ క్లెయిమ్ గురించి మరిన్ని వివరాలని తెలుసుకోవడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ దృశ్యాలు ఉన్న కొన్ని యూట్యూబ్ వీడియోలు (ఇక్కడ, ఇక్కడ) మరియు ఒక ఆర్టికల్ మాకు దొరికాయి.

ఈ యూట్యూబ్ వీడియోలలో కొందరు యూజర్లు చేసిన కామెంట్స్ మరియు మాకు దొరికిన ఆర్టికల్ ప్రకారం, ఈ వీడియో నిజానికి ‘జీయూస్ అండ్ రోక్సాన్ అనే ఒక హాలీవుడ్ సినిమాలోది. పైగా, ఈ వీడియోలలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు అనేక షాట్లు ఉన్న విధానాన్ని చూస్తేనే, ఇది మనకు స్పష్టంగా ఒక సినిమా లేదా సీరియల్ క్లిప్ లేదా సీన్ అని స్పష్టంగా అర్థం అవుతుంది. 

‘జీయూస్ అండ్ రోక్సాన్1997లో విడుదలైన ఒక ఫ్యామిలీ అడ్వెంచర్ సినిమా. ఈ సినిమా, జీయూస్ ఒక  కుక్క మరియు రోక్సాన్అనే ఓ డాల్ఫిన్ మధ్య స్నేహాన్ని చూపిస్తుంది. ఈ సినిమా యొక్క ట్రైలర్‌లో మీరు వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలను చూడచ్చు. ఈ సినిమాకి 1997లో వెరైటీ మ్యాగజైన్ వారు ఇచ్చిన రివ్యూ మీరు ఇక్కడ చూడవచ్చు. 

చివరగా, ఒక హాలీవుడ్ సినిమాలోని ఒక క్లిప్ షేర్ చేస్తూ, ఒక కుక్కను ఓ డాల్ఫిన్ కాపాడుతున్న నిజమైన సంఘటన దృశ్యాలని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll