Fake News, Telugu
 

2023లో ఒడిశాలో రెండు బీజేపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ వీడియోను తమిళనాడులో ఓటర్లు బీజేపీ నాయకులను కొడుతున్నదిగా షేర్ చేస్తున్నారు

0

దేశవ్యాప్తంగా జరగనున్న 2024 జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో తమిళనాడులో ఓట్లు అడగడానికి వెళ్లిన బీజేపీ లీడర్లను ఓటర్లు కొడుతున్నారని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజం ఉందో  పరిశీలిద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవొచ్చు

క్లెయిమ్: తమిళనాడులో ఓట్లు అడగడానికి వెళ్లిన బీజేపీ లీడర్లను ఓటర్లు కొడుతున్న వీడియో.

ఫాక్ట్ (Fact): ఈ వీడియోలోని సంఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది, తమిళనాడులో కాదు. 2023 లో ఒడిశా రాష్ట్రంలోని బలంగీర్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ హాజరు అయినప్పుడు ఆయనకు స్వాగతం చెప్పడానికి అనంత దాస్ అనే పార్టీ సభ్యుడు ర్యాలీ వాహనం దగ్గరికి వెళుతుండగా గోపాల్‌జీ పాణిగ్రాహి అనే మరొక సభ్యుడు అతనిని ఆపడానికి ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.  

వైరల్ వీడియో కీఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ‘X’ లో కొంతమంది పోస్ట్ (ఆర్కైవ్) చేసిన ఇదే వీడియో లభించింది. ఇందులో ఒక వీడియో కింద ఒక యూసర్ చేసిన  కామెంట్లో (ఆర్కైవ్) ఈ సంఘటన ఒడిశాకి సంబంధించినదని ఉంది. 

దానికి సంబంధించిన కీ వర్డ్స్ తో YouTubeలో వెతకగా ‘Kalinga TV’ 9 అక్టోబర్ 2023న పోస్ట్ చేసిన ఒక వీడియో లభించింది. ఇందులో వైరల్ వీడియోలో ఉన్న ర్యాలీ దృశ్యాలు ఈ వీడియోలో కూడా ఉన్నాయి. వీడియో కింద టైటిల్ లో ఈ ఘటన ఒడిశా రాష్ట్రం లోని బలంగీర్ జిల్లాలో బీజేపీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన గొడవగా పేర్కొన్నారు. 

పైన లభించిన సమాచారంతో ఇంటర్నెట్లో వెతకగా ఈ సంఘటనకు సంబంధించిన వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, ఒడిశా రాష్ట్రంలోని బలంగీర్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ హాజరు అయినప్పుడు ఆయనకు స్వాగతం చెప్పడానికి అనంత దాస్ అనే పార్టీ సభ్యుడు ర్యాలీ వాహనం దగ్గరికి వెళుతుండగా గోపాల్‌జీ పాణిగ్రాహి అనే మరొక సభ్యుడు అతనిని ఆపడానికి ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు ఉంది. 

చివరగా, 2023లో ఒడిశాలో రెండు బీజేపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ వీడియోను తమిళనాడులో ఓటర్లు బీజేపీ నాయకులను కొడుతున్నదిగా షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll