నిర్జీవంగా రోడ్డుపై పడి ఉన్న ఒక చిరుతపులిని మూడు అడవి పందులు కొరుకుతున్న దృశ్యాలని తిరుపతి ఘాట్ రోడ్డులో జరిగిన సంఘటన అని చెపుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: తిరుపతి ఘాట్ రోడ్డులో ఒక నిర్జీవమైన చిరుతపులిని అడవి పందులు కొరుకుతున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో సంఘటన మే 2022లో తమిళనాడులోని కొడైకెనాల్ దగ్గర జరిగింది. వార్తా కథనాల ప్రకారం తమిళనాడులోని పళని-కొడైకెనాల్ రోడ్డులో ఒక చిరుతపులి, వేగంగా ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టడం వళ్ళ చనిపోయింది. కావున ఈ పోస్తులో చేస్తున క్లెయిమ్ తప్పు.
వీడియోలోని సంఘటన గురించి ఏమైనా వార్త సంస్థలు కథనాలు ప్రచురించారు అని ఇంటర్నెట్లో సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి వెతికితే, విడియోలోని దృశ్యాలని పోలి ఉన్న ఫోటో కలిగిన వార్త కథనాలు కొన్ని లభించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
ఈ కథనాల ప్రకారం తమిళనాడులోని పళని-కొడైకెనాల్ రోడ్డులో వేరంగా వెళ్తున్న వాహనం ఒకటి ఒక ఏడాది వయసు ఉన్న చిరుతపులిని ఢీకొట్టిన సంఘటనలో చిరుత మృతిచెందింది. నిర్జీవంగా రోడ్డు పైన పడి ఉన్న చిరుతను మూడు అడవి పందులు కొరుకుతున్న దృశ్యాలని ఒక వాహనదారుడు చిత్రించాడు. ఈ దృశ్యాలు ఆ సమయంలో ఇంటర్నెట్లో వైరల్ కూడా అయ్యాయని వార్త కథనాల్లో రాసారు.
చివరిగా, 2022లో కొడైకెనాల్ దగ్గర ప్రమాదంలో ప్రాణం కోల్పోయిన చిరుతపులి దృశ్యాలని తిరుపతిలో జరిగినట్లుగా ఇప్పుడు షేర్ చేస్తున్నారు.