Fake News, Telugu
 

బెంగాల్‌లో ఫేక్ ఓటరు ఐడి తయారు చేసే గ్యాంగ్ వెలుగులోకి వచ్చిన పాత వార్తని ప్రస్తుతం సందర్భ రహితంగా షేర్ చేస్తున్నారు

0

ఇండో – బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ బార్డర్ సమీపంలోని బొంగాన్ పట్టణంలో ఫేక్ ఓటరు ఐడి కార్డ్ తయారు చేసే రాకెట్‌ను బెంగాల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పట్టుకుందని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇండో – బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ బార్డర్ సమీపంలోని బొంగాన్ పట్టణంలో ఫేక్ ఓటరు ఐడి కార్డ్ తయారు చేసే రాకెట్‌ను పట్టుకున్న బెంగాల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.

ఫాక్ట్ (నిజం): ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్‌లోని బొంగాన్ పట్టణంలో ఫేక్ ఓటరు ఐడి కార్డ్ తయారు చేసే రాకెట్‌ను పోలీసులు పట్టుకున్న ఘటనేది జరగలేదు. గతంలో (2018) పలు సార్లు బొంగాన్ పట్టణంలో ఫేక్ ఓటరు ఐడి కార్డ్ తయారు చేసే రాకెట్‌లు వెలుగులోకి వచ్చాయి. ఐతే ప్రస్తుతం ఇలాంటి ఘటనేది జరగనప్పటికీ, పాత వార్తని  ప్రస్తుతం సందర్భ రహితంగా షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్‌లోని బొంగాన్ పట్టణంలో ఫేక్ ఓటరు ఐడి కార్డ్ తయారు చేసే రాకెట్‌ వెలుగులోకి వచ్చినట్టు ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ ఇలాంటి ఘటన జరిగి ఉంటే, మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని ఈ విషయానికి సంబంధించి మాకు ఎటువంటి వార్తా కథనాలుగాని లేక ఇతర సమాచారంగాని లభించలేదు.

ఐతే డిసెంబర్ 2018లో బొంగాన్ పట్టణంలో ఫేక్ ఓటరు ఐడి కార్డ్ తయారు చేసే రాకెట్‌ను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనాల ప్రకారం ఈ గ్యాంగ్ ఓటరు ఐడితో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ కూడా ప్రింట్ చేస్తున్నారని తెలిసింది.

ఐతే అంతకుముందు ఆగస్ట్ 2018లో కూడా బొంగాన్ పట్టణంలో ఫేక్ ఓటరు ఐడి కార్డ్ తయారు చేస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు. ఐతే ప్రస్తుతం ఇలాంటి ఘటనేది జరగనప్పటికీ, పాత వార్తని  ప్రస్తుతం సందర్భ రహితంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, బెంగాల్‌లో ఫేక్ ఓటరు ఐడి తయారు చేసే గ్యాంగ్ వెలుగులోకి వచ్చిన పాత వార్తని ప్రస్తుతం సందర్భ రహితంగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll