Fake News, Telugu
 

పాత ఫోటో పెట్టి, ‘అందరూ హిందీ మాట్లాడాలి’ అని అమిత్ షా అన్నాక తీసిన ఫోటో గా తప్పుడు ప్రచారం చేస్తున్నారు

1

కొంతమంది వ్యక్తులు హిందీ భాషలో ఉన్న సైన్ బోర్డులకు నలుపు రంగు వేస్తున్న ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి ‘దేశంలో అందరూ హిందీ మాట్లాడాలి అని అమిత్ షా అనగానే, తమిళనాడు లో హిందీ పదాలు ఎక్కడ ఉన్నా నల్ల రంగు పూస్తున్నారు’ అంటూ ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమైనదో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : అమిత్ షా ఈ సంవత్సరం ‘హిందీ దివస్’ సందర్భంగా దేశంలో అందరూ హిందీ మాట్లాడాలని అన్నందుకు బదులుగా తమిళనాడు లో హిందీ పదాలు ఉన్న సైన్ బోర్డులకు నల్ల రంగు పూస్తున్నది ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఆ ఫోటో 2018లో కావేరీ మానేజ్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవడంతో, దానికి వ్యతిరేకంగా తమిళనాడులో హిందీ పదాలు ఉన్న సైన్ బోర్డులకు నల్ల రంగు పూసినది. కావున, పోస్టులో చేసిన ఆరోపణ తప్పు.  

అమిత్ షా సెప్టెంబర్ 14న, ‘హిందీ దివస్’ సందర్భంగా దేశ ఐక్యత కోసం ఒక భాష ఉండాలి అని, అది హిందీ కావాలి అని, అందరూ హిందీ మాట్లాడాలని అన్నట్లుగా ‘The Hindu’ వారి కథనం ద్వారా తెలుస్తోంది.

పోస్టులో పెట్టిన కొలేజ్ లో పైన ఉన్న ఫోటోని క్రాప చేసి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ ఫోటో ‘Times of India’ వారు ఏప్రిల్ 8, 2018న ప్రచురించినకథనం లో లభించింది. దాని ద్వారా, ఆ ఫోటో కేంద్ర ప్రభుత్వం కావేరీ మానేజ్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయడంలో విఫలమయినందుకు గానూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడులో హిందీ పదాలు ఉన్నా సైన్ బోర్డులకు నల్ల రంగు పూసినప్పటిదని తెలిసింది. అదే విషయాన్ని వెల్లడిస్తూ ‘The New Indian Express’ వారు ప్రచురించిన కథనం ఇక్కడ చూడవచ్చు.

కొలేజ్ లో క్రింద ఉన్న ఫోటో కోసం వెతికినప్పుడు, దానికి సంబంధించిన సమాచారం ఎక్కడా లభించలేదు.

చివరగా, ఆ ఫోటో  2018లో తమిళనాడు వారు హిందీ భాషలో ఉన్న సైన్ బోర్డులకు నలుపు రంగు వేసినది. అది ఇప్పటి ఫోటో కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll