Fake News, Telugu
 

అలెగ్జాండర్ భూమార్గం ద్వారా భారత దేశంలోకి ప్రవేశించాడు, వాస్కోడగామా కనుగొన్నది సముద్ర మార్గం

0

వాస్కోడగామా 1498లో భారత్ ని కనుగోని ఉంటే క్రి.పూ 320 లో అలెగ్జాండర్ భారత దేశం పై యుద్ధం ఎలా చేసాడని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పోర్చుగీస్ నావికుడు వాస్కోడగామా కంటే ముందే గ్రీసు రాజు అలెగ్జాండర్ భారతదేశంకి మార్గం కనుగొన్నాడు.

ఫాక్ట్ (నిజం): పోర్చుగీస్ నావికుడు వాస్కోడగామా 1498లో సముద్ర మార్గాం ద్వారా భారత దేశంలోని కాలికట్ తీర ప్రాంతాన్ని చేరుకున్నారు. అలెగ్జాండర్ క్రి.పూ 326 లో ఈజిప్ట్, పశ్చిమ ఆసియా దేశాల భూమార్గం ద్వార భారత ఉపఖండం లోకి ప్రవేశించాడు. అలెగ్జాండర్, వాస్కోడగామా కనుగొన్న సముద్ర మార్గాన భారతదేశంలోకి ప్రవేశించలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, పోర్చుగీస్ నావికుడు వాస్కోడగామా 1498లో భారత దేశానికి మొట్టమొదటగా సముద్ర మార్గాన్ని కనుగొన్నట్టు తెలిసింది. వాస్కోడగామా ఆఫ్రికా కోస్ట్ మీదుగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి, హిందూ మహా సముద్రం మీదుగా భారత దేశంలోని కాలికట్ తీర ప్రాంతాన్ని చేరుకున్నట్టు ‘NCERT’ బుక్స్ లో స్పష్టంగా తెలిపారు.

మాసిడోనియా రాజు అలెగ్జాండర్-3 భారత దేశానికి ఏ మర్గాన ప్రవేశించాడని వెతకగా, అలెగ్జాండర్ ఈజిప్ట్, పశ్చిమ ఆసియా దేశాల భూమార్గం ద్వార భారత ఉపఖండం లోకి ప్రవేశించినట్టు తెలిసింది. అలెగ్జాండర్ క్రి.పూ 326 లో ఉత్తర భారతంలోని సింధు నదిని దాటుకొని వచ్చి పోరస్ రాజు తో యుద్ధం చేసినట్టు భారత ప్రభుత్వ వెబ్సైటు ‘Know India’ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా అలెగ్జాండర్ సముద్ర మార్గం ద్వారా కాకుండా భూమార్గం ద్వారా భారత దేశంలోకి ప్రవేశించాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

చివరగా, గ్రీసు రాజు అలెగ్జాండర్ ఈజిప్ట్, పశ్చిమ ఆసియా దేశాల భూమార్గం ద్వారా భారత దేశంలోకి ప్రవేశించాడు, వాస్కోడగామా కనుగొన్న సముద్ర మార్గంలో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll