Fake News, Telugu
 

యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ వెళ్తుండగా సమాజ్ వాది పార్టీ నేతలు నల్ల జెండాలతో నిరసన తెలిపిన ఈ ఘటన 2018లో జరిగింది

0

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు నల్ల జెండాలు చూపి నిరసన తెలపడానికి వెళ్ళిన సమాజ్ వాది పార్టీ నాయకులు, యోగి కాన్వాయ్ ని చూసి దైర్యం లేక తలలు దాచుకుంటున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ ని చూసి సమాజ్ వాది పార్టీ నేతలు దాక్కుంటున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో కనిపిస్తున్న ఘటన ఏప్రిల్ 2018 సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ నగరంలో చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ బులంద్ షహర్ నగరంలోని నుమాయిష్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై వెళ్తున్నప్పుడు, సమాజ్ వాది పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు నలుపు జెండాలు చూపించి నిరసన తెలిపినట్టు తెలిసింది. పోలీస్ సెక్యూరిటీని దాటుకొని బ్రిడ్జి పైకి వెళ్ళిన సమాజ్ వాది కార్యకర్తలు, ముఖ్యమంత్రి వాహనం వచ్చే వరకు దాక్కొని, ఆ తరువాత నల్ల జెండాలు చూపించి నిరసన చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Jagran’ న్యూస్ సంస్థ 28 ఏప్రిల్ 2021 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్టంలోని బులంద్ షహర్ నగరంలో చోటుచేసుకున్నట్టు ఈ ఆర్టికల్ తెలిపింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ బులంద్ షహర్ నగరంలోని నుమాయిష్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై వెళ్తున్నప్పుడు, సమాజ్ వాది పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు నల్ల జెండాలు చూపించి నిరసన తెలిపినట్టు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. ముఖ్యమంత్రి సెక్యూరిటీ నియమాలను దాటి నిరసన చేసినందుకు గాను సమాజ్ వాది పార్టీ నేతలపై పోలీసులు కేసులు పెట్టినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు.

ఈ ఘటనకి సంబంధించి ‘Patrika’ న్యూస్ సంస్థ 01 మే 2018 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. 27 ఏప్రిల్ 2018 నాడు బులంద్ షహర్ నగరంలో పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నగరంలోని పోలీస్ లైన్ నుండి తన గెస్ట్ హౌస్ వెళ్తుండగా నుమాయిష్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై సమాజ్ వాది పార్టీ నేతలు నల్ల జెండాలు పట్టుకొని నిరసన చేసినట్టు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. పోలీస్ సెక్యూరిటీని దాటుకొని బ్రిడ్జి పైకి వెళ్ళిన సమాజ్ వాది కార్యకర్తలు, ముఖ్యమంత్రి వాహనం వచ్చే వరకు దాక్కొని, ఆ తరువాత నల్ల జెండాలు చూపించి నిరసన చేసారని ఈ ఆర్టికల్ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది అని, ఫోటోలో సమాజ్ వాది పార్టీ నేతలు యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ కి భయపడి దాక్కోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2018 లో తీసిన ఫోటోని షేర్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ ని చూసి సమాజ్ వాది పార్టీ నేతలు భయంతో దాక్కుంటున్న దృశ్యాలంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll