Fake News, Telugu
 

2017 నాటి ట్విట్టర్ ట్రెండ్‌ని రాహుల్ గాంధీకి ఇప్పుడు భారత్ జోడో యాత్ర నేపథ్యంలో పెరిగిన ప్రజాదరణగా షేర్ చేస్తున్నారు

0

రాహుల్ గాంధీ పాదయాత్ర భారత్ జోడో స్టార్ట్ అయ్యాక సోషల్ మీడియాలో ఒక్కసారిగా రాహుల్ పై పాజిటివిటీ పెరిగింది’ అని చెప్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ పోస్టు ప్రకారం ‘ట్విట్టర్‌లో ఏకంగా 66% మద్దతుతో అగ్రస్థానంలో రాహుల్ ఉండగా … ఏకంగా IT Wing నే నడిపే మోడీజీ  15% పాజిటివ్ రేట్ తో ఉన్నారు.’ పోస్టులో ఒక న్యూస్ యాంకర్ వీటిని వివరిస్తున్న ఒక చిత్రం కుడా ఉంది. అసలు ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేపట్టిన తర్వాత సోషల్ మీడియాలో ప్రజాదరణ పెరిగింది. 66% మద్దతుతో అగ్రస్థానంలో ఉన్నారు.

ఫ్యాక్ట్ (నిజం): పోస్టులో ఉన్న చిత్రం 2017 గుజరాత్ ఎన్నికల సమయంలో టైమ్స్ నౌ న్యూస్ ఛానల్ వాళ్ళు చేసిన ఒక కార్యక్రమంలోనిది. అందులో, ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీ నాయకుల గురించి ట్విట్టర్లో జరుగుతున్న చర్చ గురించిన చెప్తూ, రాహుల్ గాంధీకి  66%, మోదీకి 15%  ట్విట్టర్ మెన్షన్స్ (అంత శాతం మంది వారిని తమ ట్వీట్స్‌లో పేర్కొన్నారు) వచ్చాయని చెప్పారు. 2017లో వచ్చిన న్యూస్ ప్రోగ్రాంలో చెప్పిన గణాంకాలని, భారత్ జోడో యాత్ర సందర్భంలో రాహుల్ గాంధీకి వచ్చిన మద్దతుగా షేర్ చేస్తున్నారు.కావున,  పోస్టులో చెప్తున్నది తప్పు.

పోస్టులో ఉన్న చిత్రాన్ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సేర్చ్‌లో వెతుకగా, 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో   టైమ్స్ ఆఫ్ ఇండియా వారి వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). వారి వెబ్సైటులో మరియు యూట్యూబ్ ఛానెల్లో  ప్రచురించిన వీడియోలలోని విసువల్స్ పోస్టులో ఉన్న చిత్రంతో సరిపోయాయి.

 టైమ్స్ నౌ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇదే వీడియో లభించింది. రాహుల్ గాంధీనే  సోషల్ మీడియాలో టాకింగ్ పాయింట్ అని ఆ వీడియో యొక్క శీర్షిక. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టైమ్స్ నౌ వారు చేసిన ఈ ప్రోగ్రాంలో, ట్విట్టర్లో పలువురు రాజకీయ నాయకుల గురించి యూజర్లు చేసిన ట్వీట్స్‌ని  విశ్లేషిస్తూ, రాహుల్ గాంధీకి 66%, మోదీకి 15%  ట్విట్టర్ మెన్షన్స్ వచ్చాయని చెప్పారు. అందులో 62% రాహుల్ గాంధీకి అనుకూలంగా, 38% వ్యతిరేఖంగా ట్వీట్లు వచ్చాయని వివరించారు. ఈ వీడియోలోని స్క్రీన్‌షాట్‌ని ఇప్పుడు భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీకి సోషల్ మీడియాలో సానుకూలత పెరిగింది అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

కాంగ్రస్ ని  పొగిడిన ఆర్.ఎస్.ఎస్ అధినేత మోహన్ భగవత్

భరత్ జోడో యాత్ర సందర్భంలోనే మరొక పోస్టు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.  ‘#స్వాతంత్ర_పోరాటం లో #కాంగ్రెస్ కీలక పాత్ర పోషించింది..ఎంతో మంది #గొప్ప_నాయకుల్ని ఈ దేశానికి అందించింది..ఇప్పటికి వారు మనకి #ఆదర్శప్రాయంగా ఉన్నారు.’ అని RSS నాయకుడు మోహన్ భగవత్ చెప్పినట్లు పోస్టులో పేర్కొన్నారు.

అయితే, మోహన్ భగవత్ కాంగ్రెస్ పార్టీని గురుంచి ఈ వ్యాఖలు చేసిన వార్త నిజమే. కాకపోతే, ఇవి 2018లో ఒక సభలో తాను కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పెద్ద పాత్ర పోషించింది అని చెప్పినప్పటిది. సంభందిత వార్త ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు . 

చివరగా, భారత్ జోడో యాత్ర నేపథ్యంలో, 2017 నాటి ట్విట్టర్ ట్రెండ్‌ని రాహుల్ గాంధీకి ఇప్పుడు సోషల్ మీడియాలో పెరిగిన ప్రజాదరణకి సూచన అన్నట్లు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll