ఒక మహిళను పోలీసులు లాక్కొని వెళ్తున్న ఫోటోని పెట్టి, అది తాజాగా అమరావతి లో జరుగుతున్న నిరసనలకు సంబంధించిన ఫోటో అంటూ చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్: పోలీసులు ఒక మహిళను పట్టుకొని వెళ్తున్న ఫోటో తాజాగా అమరావతిలో జరుగుతున్న నిరసనలకు సంబంధించింది.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటో తాజాగా అమరావతి లో జరుగుతున్న నిరసనలకు సంబంధించింది కాదు. ఆ ఫోటో 2017 లో ఆక్వా ఫుడ్ పార్క్ కి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన రైతులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నపుడు తీసినది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, 2017 లో ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన ఒక ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ లో అదే ఫోటో ఉంటుంది. 2017 లో ఆక్వాఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులపై పోలీసులు విరుచుకుపడినప్పుడు ఆ ఫోటో తీసినట్టుగా ఆ ఆర్టికల్ లో చదవొచ్చు. అదే ఫోటోని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక కూడా నవంబర్ 30, 2017 న ప్రచురించింది.


చివరగా, 2017 లో తీసిన ఫోటో పెట్టి, తాజాగా అమరావతిలో పోలీసుల దారుణం అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?