Fake News, Telugu
 

పోస్ట్‌లోని ఫోటో 2017లో తీసినది; తాజగా యూఎస్ నేవీ నిర్వహించిన ‘FONOP’కి సంబంధించింది కాదు

0

అద్భుత దృశ్యం. చైనాను సవాల్ చేస్తూ దక్షిణ చైనా సముద్రంలో FONOP ఎక్సర్‌సైజ్‌ను నిర్వహించడానికి — భారీ బలగంతో, దక్షిణ చైనా సముద్రంలోకి అడుగు పెట్టిన అమెరికన్ నేవీ’, అని చెప్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ‘FONOP’ అంటే – ‘Freedom of Navigation Operation’. పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దక్షిణ చైనా సముద్రంలో అమెరికా తాజాగా నిర్వహించిన FONOP ఎక్సర్‌సైజ్‌ ఫోటో.

ఫాక్ట్: పోస్ట్‌లోని ఫోటో తాజాగా అమెరికా నిర్వహించిన ఎక్సర్‌సైజ్‌కు సంబంధించిన ఫోటో కాదు; ఫోటోలోని ఎక్సర్‌సైజ్‌ ‘Sea of Japan’ లో నిర్వహించినట్టు తెలిసింది. తాజాగా దక్షిణ చైనా సముద్రంలో (జులై 2021లో) మరియు అరేబియన్ సముద్రంలో (ఏప్రిల్ 2021లో) యూఎస్ నేవీ ‘FONOP’ నిర్వహించిన మాట వాస్తవమే అయినా, పోస్ట్‌లో 2017లో తీసిన ఫోటోని పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్‌లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అదే ఫోటో ‘Alamy’ స్టాక్ ఫోటో వెబ్‌సైట్‌లో ఉన్నట్టు సెర్చ్ రిజల్ట్స్‌లో వస్తుంది. ఆ ఫోటోని మార్చి 2017లో తీసినట్టు తెలిసింది. యూఎస్ మరియు దక్షిణ కొరియా దేశాల నేవీ నౌకలు ‘Sea of Japan’లో (జపాన్ సముద్రం) నిర్వహించిన ‘Operation Foal Eagle’లో పాల్గొన్నపుడు ఆ ఫోటో తీసినట్టు, ఆ ఫోటో యొక్క వివరణలో చదవొచ్చు. ‘Foal Eagle – 2017’కి సంబంధించిన మరిన్ని ఫోటోలను ఇక్కడ చూడవొచ్చు. వేరే ఫోటోల్లో కొన్ని నౌకలపై దక్షిణ కొరియా జెండా ఉన్నట్టు గమనించవొచ్చు.

‘U.S. Pacific Fleet’ కి చెందిన ‘Naval Surface Forces’ అధికారిక ట్విట్టర్ అకౌంట్ కూడా పోస్ట్‌లోని ఫోటోని 2017లో ట్వీట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. మరిన్ని ఫోటోలను ఇక్కడ చూడవొచ్చు. కాబట్టి, పోస్ట్‌లోని ఫోటో తాజాగా అమెరికా నిర్వహించిన ఎక్సర్‌సైజ్‌కు సంబంధించిన ఫోటో కాదు, ఫోటోలోని ఎక్సర్‌సైజ్‌ ‘Sea of Japan’ లో నిర్వహించినట్టు తెలిసింది.

తాజాగా దక్షిణ చైనా సముద్రంలో ‘FONOP’కి సంబంధించి యూఎస్ నేవీ చేసిన ట్వీట్‌ని ఇక్కడ చూడవొచ్చు.

ఏప్రిల్ 2021లో భారత ప్రభుత్వం అనుమతి లేకుండా, భారత్ యొక్క ‘Exclusive Economic Zone’ లో కూడా యూఎస్ నేవీ ‘FONOP’ నిర్వహించింది.

ఆ ఘటన పై భారత ప్రభుత్వం యొక్క స్పందన గురించి ఇక్కడ చదవొచ్చు.

చివరగా, పోస్ట్‌లోని ఫోటో 2017 లో తీసినది; తాజగా దక్షిణ చైనా సముద్రంలో యూఎస్ నేవీ నిర్వహించిన ‘FONOP’ కి సంబంధించింది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll