తాజాగా కేరళ లో చనిపోయిన గర్భిణి ఏనుగు యొక్క అంత్యక్రియలు అని చెప్తూ, ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేరళ లో చనిపోయిన గర్భిణి ఏనుగు యొక్క అంత్యక్రియల ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటో పాతది. అది 2015 లో తీసిన ఫోటో. ఆ ఫోటోలో అంత్యక్రియలు జరుగుతున్నవి కర్ణాటక లోని సిరిగేరి తరలబలు మటం కి చెందిన ‘గౌరీ’ అనే ఏనుగువి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ చేసిన ఫోటోలో ఏనుగు మీద ‘ತರಳಬಳು’ (‘తరలబలు’) అని కన్నడలో రాసి ఉన్నట్టు చూడవొచ్చు. కాబట్టి, ఆ పేరుతో ఫేస్బుక్ లో వెతకగా, అదే ఫోటోని ఒకరు 2015 లోనే పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ, కేరళ లో గర్భిణి ఏనుగు చనిపోయింది మే 2020 లో. కావున, ఆ ఫోటోకీ, కేరళ లో చనిపోయిన ఏనుగు కి ఎటువంటి సంబంధం లేదు.
అంతేకాదు, పాత పోస్టులో ఉన్న సమాచారంతో ఇంటర్నెట్ లో వెతకగా, సిరిగేరి తరలబలు మటం కి చెందిన ‘గౌరీ’ అనే ఏనుగు చనిపోయినట్టు 2015 లో ‘వన్ ఇండియా – కన్నడ’ వారు ప్రచురించిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఇదే విషయాన్ని చెప్తూ, ‘బూమ్ లైవ్’ వారు కూడా ఇంతకముందే ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ రాసారు. కేరళ లో చనిపోయిన గర్భిణి ఏనుగు యొక్క అంత్యక్రియలు అంటూ మరొక వీడియో కూడా వైరల్ అవ్వగా, అది తప్పు అని చెప్తూ FACTLY రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.
చివరగా, 2015 లో కర్ణాటక లోని సిరిగేరి తరలబలు మటం కి చెందిన ‘గౌరీ’ అనే ఏనుగు అంత్యక్రియల ఫోటో పెట్టి, తాజాగా కేరళ లో చనిపోయిన గర్భిణి ఏనుగు యొక్క అంత్యక్రియలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?