Fake News, Telugu
 

2014 లోక్‌సభ ఎన్నికలప్పటి వీడియోని నరేంద్ర మోదీ ఇటీవల వారణాసిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

నరేంద్ర మోదీ ఇటీవల వారణాసిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ యొక్క దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: నరేంద్ర మోదీ ఇటీవల వారణాసిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ యొక్క దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వారణాసిలో ఎన్నికల నామినేషన్ దాఖలు చేయడానికి నరేంద్ర మోదీ భారీ ర్యాలీతో తరలివెళ్ళిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోకి ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ 25 ఏప్రిల్ 2014 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. వారణాసిలో నరేంద్ర మోదీ నిర్వహించిన రోడ్ షోకి భారీగా తరలివచ్చిన జనాలు, అంటూ ఈ వీడియోలో తెలిపారు. ఈ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, నరేంద్ర మోదీ 24 ఏప్రిల్ 2014 నాడు వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించి తన ఎన్నికల నామినేషన్ దాఖలు చేసినట్టు తెలిసింది

జనసంద్రంతో కిక్కిరిసిపోయిన ఈ రోడ్ షో యొక్క పూర్తి వీడియోని బీజేపీ తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసింది. 2014లో వారణాసిలో జరిగిన ఈ ర్యాలీ గురించి పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ అలాగే, వీడియోలని పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ ఇటీవల వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్ షో యొక్క దృశ్యాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో 2014 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించినదని, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిందని కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.  

చివరగా, 2014 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన వీడియోని నరేంద్ర మోదీ ఇటీవల వారణాసిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll