Fake News, Telugu
 

పాత ఫోటోని చూపిస్తూ ముకేష్ అంబానీ మనవడిని చూడ్డానికి ప్రధాని మోదీ ఆసుపత్రికి వెళ్ళాడని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

నరేంద్ర మోదీ, ముకేష్ అంబానీ మరియు నీతా అంబానీ హాస్పిటల్ లో ఉన్న ఫోటోని చూపిస్తూ ఆందోళనలు చేస్తున్న రైతులను కలవడానికి రాలేదుగాని ముకేష్ అంబానీ మనవడిని చూడటానికి ఆసుపత్రికి వెళ్లిన మోదీ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల జన్మించిన ముకేష్ అంబానీ మనవడిని చూడ్డానికి మోదీ హాస్పిటల్ కి వెళ్ళాడు.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటో 2014లో ముంబైలో జరిగన రిలయన్స్ హాస్పిటల్ ని మోదీ ప్రారంభించిన సందర్భంలో తీసింది. ఈ ఫోటోతో రైతుల నిరసనలకుగాని, ముకేష్ అంబానీ మనవడికిగాని ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఫోటోకి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా పోస్టులో ఉన్న ఫోటో యొక్క ఫ్లిప్ చేసిన ఫోటోను ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ ఫోటో 2014లో ముంబైలో  రిలయన్స్ సంస్థకి చెందిన ‘HN రిలయన్స్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్’ ను మోదీ ప్రారంభించిన సందర్భంలో తీసింది.

ఈ హాస్పిటల్ ప్రారంభానికి సంబంధించి మరొక వార్తా కథనంలో కూడా ఇదే ఫోటో ప్రచురించారు. PMO India అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసారు, ఈ వీడియో ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇటీవల జన్మించిన ముకేష్ అంబానీ మనవడిని చూడ్డానికి మోదీ హాస్పిటల్ కి వెళ్ళాడని చెప్పే వార్తా కథనంగాని, అధికారిక సమాచారం గాని మాకు లభించలేదు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, రిలయన్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సంబంధించి 2014లో తీసిన ఫోటోని ముకేష్ అంబానీ మనవడిని చూడ్డానికి మోదీ హాస్పిటల్ కి వెళ్ళాడని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll