Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

గుజరాత్ లో కోవిడ్-19 పేషంట్ల కోసం 2200 పడకల ఆసుపత్రిని కొత్తగా కట్టలేదు

0

చైనా రికార్డును ఇండియా బద్దలుకొట్టిందని, చైనా వారు 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని కడితే, మన దేశంలోని గుజరాత్ లో కేవలం 6 రోజుల్లో 2200 పడకల ఆసుపత్రి కట్టారని చెప్తూ ఫేస్బుక్ లో కొంతమంది పోస్టులు పెడ్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: గుజరాత్ లో కేవలం 6 రోజుల్లో 2200 పడకల ఆసుపత్రిని కట్టారు.

ఫాక్ట్ (నిజం): గుజరాత్ లో కొరోనా వైరస్ పేషంట్ల కోసం 2200 పడకల ఆసుపత్రిని కొత్తగా కట్టలేదు. ప్రభుత్వం ముందస్తుగా 4 నగరాల్లో అప్పటికే ఉన్న ఆసుపత్రుల్లో కేవలం కొరోనా వైరస్ రోగులకు చికిత్స అందించేలా 2200 పడకలు ఏర్పాటు చేసింది. కావున, పోస్టు లో చెప్పింది తప్పు. 

పోస్టు లో చెప్పిన విషయం గురించి గూగుల్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, ‘The Hindu Business Line’ వారి 28 మార్చి కథనం లభించింది. దాని ద్వారా, గుజరాత్ లో కొరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం 4 నగరాల్లో 2200 మందికి చికిత్స అందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసిందని, అందులో భాగంగా అహ్మదాబాద్ లో 1200 పడకల ఆసుపత్రిని, సూరత్ మరియు రాజ్ కోట్ లో 500 పడకల ఆసుపత్రిని మరియు వదోదర లో 250 పడకల ఆసుపత్రిని సిద్ధం చేసారని తెలిసింది.

పోస్టు లో గుజరాత్ రాష్ట్రం లో కట్టబడిన ఆసుపత్రి అని చెప్తూ పెట్టిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ‘Times of India’ వారు గుజరాత్ లో కొరోనా వైరస్ రోగుల కోసం ప్రభుత్వం ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్ల కోసం ప్రచురించిన  కథనం లో లభించింది. అందులో ఆ ఫోటో కి సంబంధించిన కచ్చితమైన సమాచారమేమమీ లభించలేదు, కానీ ఆ కథనం ద్వారా కూడా ప్రభుత్వం అప్పటికే ఉన్న ఆసుపత్రుల్లోనే కేవలం కొరోనా వైరస్ రోగులకి చికిత్స చేసేలా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది.

చివరిగా, గుజరాత్ లో కొరోనావైరస్ పేషంట్ ల కోసం 2200 ల పడకల ఆసుపత్రిని కొత్తగా కట్టలేదు. ప్రభుత్వం ముందస్తుగా 4 నగరాల్లో అప్పటికే ఉన్న ఆసుపత్రుల్లో 2200 మందికి  చికిత్స అందించగలిగేలా ఏర్పాట్లు చేసింది.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll