Fake News, Telugu
 

కశ్మీర్‌లో విద్యాభారతి గత కొన్ని దశాబ్దాలుగా హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ స్కూల్స్ నిర్వహిస్తోంది

0

ప్రధానమంత్రి మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరవాత కశ్మీర్‌లోని పిల్లలు తిలకం బొట్టు ధరించి ఉత్సాహంగా స్కూల్‌కు వస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరవాతే అక్కడి పిల్లలు చదువుకుంటున్నారని అర్ధం వచ్చేలా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చేస్తున్న క్లెయిమ్‌లో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరవాత కశ్మీర్‌లోని పిల్లలు తిలకం బొట్టు ధరించి ఉత్సాహంగా స్కూల్‌కు వస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): విద్యాభారతి సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో కశ్మీర్‌తో పాటు అనేక ప్రాంతాలలో వివిధ పేర్లతో స్కూల్స్ నిర్వహిస్తున్నాయి. అప్పటినుండే ఈ స్కూల్స్‌లో చాలా వరకు హిందూ సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నాయి. మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి, ఈ స్కూల్స్‌ నిర్వహణకు ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుతం షేర్ అవుతున్న  వీడియో కశ్మీర్‌లోని భదేర్వః ప్రాంతంలో 1989లో ఏర్పాటైన విద్యాభారతి స్కూల్‌కు సంబంధించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో కశ్మీర్‌లోని విద్యాభారతి స్కూల్‌ విద్యార్థులు వేసవి సెలవులు అనంతరం తిరిగి స్కూల్‌కు వచ్చినప్పుడు ఆ స్కూల్ టీచర్స్ వారిని తిలకం బొట్టుతో ఆహ్వానించిన సందర్భానికి సంబంధించింది (ఇక్కడ మరియు ఇక్కడ). ఐతే పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ఈ పిల్లలు స్కూల్‌కు వెళ్ళడానికి ఎటువంటి సంబంధం లేదు.

విద్యాభారతి సంస్థలు 1952 నుండే తమ పాఠశాలల ద్వారా విద్యను అందిస్తున్నాయి. యూపీలో సరస్వతీ శిశు మందిర్ పేరుతో ఒక చిన్న పాఠశాలగా ప్రారంభించబడి, ఇప్పుడు ఈ విద్యాభారతి సంస్థలు శిశు వాటిక, శిశుమందిర్, విద్యా మందిర్ సరస్వతీ విద్యాలయం మొదలైన వివిధ పేర్లతో పనిచేస్తున్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

కశ్మీర్‌లో కూడా విద్యాభారతి అనేక సంవత్సరాల నుండి స్కూల్స్ నడిపిస్తోంది. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో కశ్మీర్‌లోని భదేర్వః ప్రాంతంలో 1989లో ఏర్పాటైన విద్యాభారతి స్కూల్‌కు సంబంధించింది. దీన్నిబట్టి ఈ స్కూల్స్ నిర్వహణకు మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ఎటువంటి సంబంధం లేదని, ఇవి గత కొన్ని దశాబ్దాలుగా కశ్మీర్‌లో నడుస్తున్నాయని అర్ధం చేసుకోవచ్చు.

ఈ స్కూల్స్‌కు సంబంధించిన సోషల్ మీడియా మరియు యూట్యూబ్ చానల్స్‌లో పిల్లలు గతంలో కూడా హిందూ సంప్రదాయాలను పాటిస్తున్న వీడియోలు కనిపిస్తాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఉదాహారణకు ఈ స్కూల్ పిల్లలు 2018లో మాతృ పితృ పూజ దివస్‌లో పాల్గొన్న వీడియో ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి ఆగస్ట్ 2019లో ఆర్టికల్ 370 రద్దు కాకముందు నుండే ఈ స్కూల్స్ హిందూ సంప్రదాయాలు పాటిస్తున్నాయని స్పష్టమవుతుంది.

చివరగా, కశ్మీర్‌లో విద్యాభారతి గత కొన్ని దశాబ్దాలుగా హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ స్కూల్స్ నిర్వహిస్తోంది.

Share.

About Author

Comments are closed.

scroll