‘ముస్లిం యువతకు 100% సబ్సిడీ పై రుణాలు. 100% సబ్సిడీ అంటే 10 లక్షలు తీసుకుంటే రూపాయి కూడా కట్టనక్కరలేదు’, అని చెప్తూ కేసీఆర్ ఫోటోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ముస్లిం యువతకు 100% సబ్సిడీ పై రుణాలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం. 100% సబ్సిడీ అంటే 10 లక్షలు తీసుకుంటే ఒక్క రూపాయి కూడా కట్టనక్కరలేదు.
ఫాక్ట్: కేవలం ముస్లింలకు మాత్రమే కాదు, ఇతర మైనారిటీలకు, బీసీలకు, ఎస్సీలకు కూడా స్వయం ఉపాధి మరియు వ్యాపారం కోసం తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అయితే, యూనిట్ ఖర్చు 50 వేల దాకా ఉంటేనే 100 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. 50 వేలు దాటితే 100 శాతం సబ్సిడీ రాదు. యూనిట్ ఖర్చు రెండు నుండి10 లక్షలు మధ్య ఉంటే, 60 శాతం లేదా ఐదు లక్షల వరకు మాత్రమే సబ్సిడీ వస్తుంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ‘Telangana State Minorities Finance Corporation’ వెబ్సైటులో ఆ పథకానికి సంబంధించిన వివరాలు దొరికాయి. ఆ పథకం పేరు ‘Self Employment/Economic Support Scheme to the Minorities beneficiaries’ అని తెలుస్తుంది. స్వయం ఉపాధి మరియు వ్యాపారానికి సంబంధించిన యూనిట్ ఖర్చు 50 వేల దాకా ఉంటేనే 100 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. 50 వేలు దాటితే 100 శాతం సబ్సిడీ రాదు. యూనిట్ ఖర్చు రెండు నుండి10 లక్షలు మధ్య ఉంటే, 60 శాతం లేదా ఐదు లక్షల వరకు మాత్రమే సబ్సిడీ వస్తుంది. కేవలం ముస్లింలకు మాత్రమే కాదు, ఈ పథకం ఇతర మైనారిటీలకు కూడా వర్తిస్తుంది. మరిన్ని వివరాలు ఇక్కడ చూడవొచ్చు.

ఎస్సీలకు మరియు బీసీలకు కూడా ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం కూడా మైనారిటీలకు మరియు బలహీనవర్గాలకు వివిధ రాయితీలతో కూడిన రుణాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది.
చివరగా, ముస్లింలకు మాత్రమే కాదు, ఇతర మైనారిటీలకు, బీసీలకు మరియు ఎస్సీ లకు కూడా స్వయం ఉపాధి మరియు వ్యాపారం కోసం తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. యూనిట్ ఖర్చు 50 వేల దాకా ఉంటేనే 100 శాతం సబ్సిడీ వర్తిస్తుంది.