Fake News, Telugu
 

దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి C-Voter సంస్థ ఎటువంటి సర్వే నిర్వహించలేదు

0

దుబ్బాకలో జరగోబోయే ఉపఎన్నికకు సంబంధించి C-Voter సంస్థ ఒక ప్రీ పోల్ సర్వే నిర్వహించిందని చెప్తూ ఈ సర్వే సంబంధించిన వివరాలు షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి C-Voter సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే వివరాలు.

ఫాక్ట్ (నిజం): FACTLY  C-Voter సంస్థని మెయిల్ ద్వారా సంప్రదించినప్పుడు దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి C-Voter సంస్థ ఎటువంటి సర్వే నిర్వహించలేదని, తమ సంస్థ దుబ్బాకలో సర్వే నిర్వహించిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఇది ఒక ఫేక్ న్యూస్ అని వారు స్పష్టం చేసారు. పైగా ఈ సంస్థ వెబ్సైటు లో గాని, అధికారిక సోషల్ మీడియా సైట్స్ లో గాని దుబ్బాక ఉప ఎన్నిక సర్వేకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ విషయానికి సంబంధించి సమాచారం కొరకు C-Voter సంస్థ యొక్క అధికారిక వెబ్సైటు లో వెతకగా దుబ్బాకలో ఈ సంస్థ సర్వే నిర్వహించినట్టు ఎటువంటి సమాచారం లేదు. ఈ సంస్థ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా దుబ్బాక సర్వేకి సంబంధించి ఎటువంటి సమాచారం షేర్ చేయలేదు.

FACTLY C-Voter సంస్థని మెయిల్ ద్వారా సంప్రదించగా, దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి C-Voter సంస్థ ఎటువంటి సర్వే నిర్వహించలేదని, తమ సంస్థ దుబ్బాకలో సర్వే నిర్వహించిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఇది ఒక ఫేక్ న్యూస్ అని వారు స్పష్టం చేసారు. దీన్నిబట్టి పోస్టులో చెప్తున్నట్టు దుబ్బాకలో జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించి C-Voter సంస్థ ఎటువంటి సర్వే నిర్వహించలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, దుబ్బాకలో జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించి C-Voter సంస్థ ఎటువంటి సర్వే నిర్వహించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll