Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

పది నెలల క్రితం వీడియోని పోస్టు చేసి ‘గాంధీ హాస్పిటల్ లో ప్రస్తుత పరిస్థితి’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

రెండు మృతదేహాలు హాస్పిటల్ పార్కింగ్ లాట్ దగ్గర పడి ఉన్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అది గాంధీ హాస్పిటల్ లో ప్రస్తుత పరిస్థితిది అని చెప్తున్నారు. హైదరాబాద్ లో కోవిడ్-19 నిర్ధారణ అయిన వారికి గాంధీ హాస్పిటల్ లో చికిత్సని అందిస్తున్న తరుణం లో వీడియోని సోషల్ మీడియా లో పోస్టు చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ (COVID – 19 చికిత్సకి ప్రత్యేక ఆసుపత్రి) లో ప్రస్తుత పరిస్థితి వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని వీడియో పాతది. అది కనీసం ‘ఆగస్ట్ 2019’ నుండి ఇంటర్నెట్ పై ఉన్నట్లుగా తెలిసింది. కావున వీడియో ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ లో కోవిడ్-19 కి చికిత్సనందిస్తున్న సందర్భానికి సంబంధించినది కాదు. పోస్ట్ లో చెప్పిన విషయం తప్పుద్రోవ పాటించేలా ఉంది.

వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో యూట్యూబ్ లో లభించింది. దానిని ‘ఆగస్ట్ 2019’ లో ‘Two dead bodies Gandhi Hospital parking area’ అని టైటిల్ తో అప్లోడ్ చేశారు. వీడియోని ఫేస్బుక్ లో కూడా అదే వివరణ తో ‘ఆగస్ట్ 2019’ లో పోస్టు చేశారు. కావున వీడియో కనీసం ‘ఆగస్ట్ 2019’ నుండి ఇంటర్నెట్ పై ఉన్నట్లుగా తెలిసింది. కాబట్టి అది ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ లో కోవిడ్-19 చికిత్సనందిస్తున్న సందర్భానికి సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

మేము ఆ వీడియో ఏ సందర్భానికి సంబంధించింది అనే విషయాన్ని నిర్ధారించలేక పోయాము. అయితే, ‘The New Indian Express’ వార్తా సంస్థ ఆ వీడియో ‘ఆగస్ట్ 2019’ లో వైరల్ అయినప్పుడు ఒక కథనాన్ని రాసింది. అప్పటి గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆ ఆరోపణలను ఖండించారు. ఆ వీడియో లో చెప్పింది తప్పుడు సమాచారం అని తెలిపారు.

చివరిగా, పది నెలల క్రితం వీడియో పోస్టు చేసి ‘గాంధీ హాస్పిటల్ లో ప్రస్తుత పరిస్థితి’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll