Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

సంబంధం లేని 2018 వీడియోని మెక్సికో దేశంలో కరోన బారిన పడి మృతి చెందిన శవాలను సముద్రంలో పడేస్తున్నారంటూ షేర్ చస్తున్నారు

0

మెక్సికో దేశంలో కరోన వైరస్ బారిన పడి మృతిచెందిన వ్యక్తుల శవాలను సముద్రంలో పడేస్తున్నారు, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మెక్సికో దేశంలో కరోన వైరస్ బారిన పడి మృతిచెందిన శవాలను సముద్రంలో పడేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. జులై 2018 నుంచే ఇంటర్నెట్ లో ఉంది. డిసెంబర్ 2019లో చైనా దేశంలో మొట్టమొదటి కరోన కేస్ నమోదయ్యింది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

వీడియోలోని స్క్రీన్ షోట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయగా, అవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియో ‘Imgur.com’ అనే వెబ్సైటులో దొరికింది. ఆ వీడియో ‘Skydiving out of the largest helicopter in use today, the Mi-26’ అనే టైటిల్ తో ’25 జులై 2018’ నాడు పోస్ట్ చేసారు. ఈ వివరాల ఆధారంగా గూగుల్ లో వెతకగా, Mi 26 హెలికాప్టర్ నుండి గాల్లోకి దూకుతున్న పారాట్రూపర్లు, అంటూ షేర్ చేసిన చాలా వీడియోలు దొరికాయి. ఆ వీడియోలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. FACTLY విశ్లేషణలో ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి అధికారిక ఆధారాలు దొరకనప్పటికి, 2018 నుండే ఆ వీడియో ఇంటర్నెట్ లో ఉంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. చైనా దేశంలో మొట్టమొదటి కరోన వైరస్ కేస్ డిసెంబర్ 2019లో నమోదయ్యింది. కావున, పోస్టులో షేర్ చేసిన ఆ వీడియోకి కరోన వైరస్ కి సంభందం లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని 2018 వీడియోని మెక్సికో దేశంలో కరోనతో మృతిచెందిన శవాలను సముద్రంలో పడేస్తున్నారంటూ షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll