ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ పేరు మీద డిక్షనరీలో యేసు క్రీస్తు గురించి మత ప్రచారం ఉందని ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. జగనన్న విద్యాకానుక పథకంలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా అందించిన ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ‘గాడ్‌పేరెంట్’ పదం యొక్క నిర్వచనాన్ని చూపిస్తూ ఏపీ ప్రభుత్వం మార్పులు చేసిందని వీడియో ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఏపీ ప్రభుత్వం ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో ‘గాడ్’, ‘గాడ్‌పేరెంట్’ యొక్క అర్ధాలకు చేసిన మార్పులను చూపించే వీడియో.
ఫాక్ట్: మార్కెట్‌లో లభించే నిఘంటువుతో పోలిస్తే, ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా అందించిన ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ‘గాడ్’, గాడ్‌పేరెంట్ ‘ గురించిన కంటెంట్ ఒక్కటే. కొన్ని ఇతర నిఘంటువులు కూడా ‘గాడ్’ మరియు ‘గాడ్‌పేరెంట్ ‘ యొక్క ఇదే విధమైన నిర్వచనాన్ని కలిగి ఉన్నాయి. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ నిఘంటువులకు ప్రమాణంగా పరిగణించబడుతుంది. ఆక్స్‌ఫర్డ్ అభ్యాసకుల నిఘంటువులో (Oxford Learner’s Dictionary) ‘గాడ్’ యొక్క నిర్వచనం “(క్రైస్తవం, ఇస్లాం మరియు జుడాయిజంలో) ఆరాధించబడే మరియు విశ్వాన్ని సృష్టించినట్లు విశ్వసించబడే ఆత్మ. గాడ్‌పేరెంట్ అంటే, “క్రైస్తవ బాప్తిసం వేడుకలో ఒక బిడ్డకు బాధ్యత వహిస్తాను మరియు క్రైస్తవ మతం గురించి వారికి బోధిస్తానని వాగ్దానం చేసే వ్యక్తి.” గాడ్ పేరెంట్ అనేది ఎక్కువగా క్రైస్తవ మతంతో సంబంధం ఉన్న పదం.
ఆన్‌లైన్‌లో ఎన్నో నిఘంటువులు అందుబాటులో ఉన్నాయి, ఇందులో చాలా వరకు విశ్వసనీయమైనవి. ఈ నిఘంటువులలోని నిర్వచనాలను మనం పోల్చినట్లయితే, కొన్నిట్లో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఇచ్చిన నిర్వచనాల మాదిరిగానే ఉన్నాయి. ఒక నిఘంటువు సాధారణంగా ఒక పదానికి బహుళ నిర్వచనాలను ఇస్తుందని, అందులో ఆన్‌లైన్ నిఘంటువులు కూడా ఉన్నాయని గమనించాలి.
ఇతర నిఘంటువులలో ‘గాడ్’మరియు ‘గాడ్‌పేరెంట్’ యొక్క అర్ధాలు.
మెర్రియమ్ వెబ్‌స్టర్ ఆన్‌లైన్ (Merriam Webster Online):
మెర్రియమ్ వెబ్‌స్టర్ వెబ్ సైట్ ప్రకారం, వారు ఇచ్చిన ‘గాడ్ యొక్క ఆవశ్యక (essential) అర్థం’“పరిపూర్ణమైన మరియు శక్తివంతమైన ఆత్మ లేదా ముఖ్యంగా క్రైస్తవులు, యూదులు మరియు ముస్లింలు విశ్వాన్ని సృష్టించి పాలించి ఆరాధించే వ్యక్తి”. ‘గాడ్ యొక్క పూర్తి నిర్వచనం’ లో,“ గాడ్: సర్వోన్నత లేదా అంతిమ వాస్తవికత శక్తిలో పరిపూర్ణంగా ఉండి, జ్ఞానం మరియు మంచితనం వంటి (యూదు మతం, క్రైస్తవమతం, ఇస్లాం మరియు హిందూమతంలోవలె) విశ్వసృష్టికర్త మరియు పాలకుడు.” మెర్రియమ్ వెబ్ స్టర్ ప్రకారం, గాడ్‌పేరెంట్ అంటే ‘బాప్టిజం వద్ద ప్రాయోజితుడు’.
మెర్రియమ్ వెబ్ స్టర్ వెబ్ సైట్ ఇచ్చిన ఇతర నిర్వచనాలు కూడా ఉన్నాయి.
కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఆన్‌లైన్:
కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఆన్‌లైన్ వెబ్ సైట్, ‘గాడ్’ అర్థం ఇలా ఇవ్వబడింది,“(క్రైస్తవ, యూదు, మరియు ముస్లిం నమ్మకంలో ) విశ్వం, భూమి మరియు దాని ప్రజలను సృష్టించి పాలించే జీవి.” గాడ్‌పేరెంట్ యొక్క ఒక నిర్వచనం ఏమిటంటే, “మరొకవ్యక్తి బిడ్డ యొక్క నైతిక మరియు క్రైస్తవ మత అభివృద్ధికి పాక్షికంగా బాధ్యత వహించే వయోజనుడు.”
ఆన్‌లైన్‌లో కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఇచ్చిన ఇతర నిర్వచనాలు కూడా ఉన్నాయి.
విక్షనరీ:
విక్షనరీ ప్రకారం గాడ్ అంటే, “వివిధ ఏకేశ్వరమతాల, ప్రత్యేకి౦చి యూదు మత౦, క్రైస్తవత్వ౦, ఇస్లా౦ల ఏకైక దేవత.” గాడ్‌పేరెంట్ అంటే,”ఒకనామకరణ వేడుక లేదా బాప్తిజం తీసుకునే సమయ౦లో పిల్లల కోస౦ నిలబడినవ్యక్తి.”
గూగుల్ నిఘంటువు, dictionary.com వంటి ఇతర నిఘంటువులు అలాంటి నిర్వచనాలను ఇవ్వలేదు. నిర్వచనాలు వివిధ మతాలకు ప్రత్యేకించబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ వింగ్ యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతా అదే వాదనను ట్వీట్ చేసింది. జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా ఉచితంగా అందించిన ఆక్స్ ఫర్డ్ నిఘంటువులో ‘గాడ్’ నిర్వచనాన్ని ఏపీ ప్రభుత్వం మార్చలేదని వారు ఒక వీడియోను పోస్ట్ చేసారు. వీడియోలో, వారు మార్కెట్లో అందుబాటులో ఉన్న నిఘంటువును పథకం అందించిన నిఘంటువుతో పోల్చారు; రెండు నిఘంటువుల్లో ఒకే అర్ధాలు ఉన్నయని తేల్చారు.
చివరగా, జగనన్న విద్యాకానుక పథకంలో భాగంగా విద్యార్థులకు అందించిన ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో ‘ గాడ్’, ‘గాడ్‌పేరెంట్’ అనే నిర్వచనాన్ని ఏపీ ప్రభుత్వం మార్చలేదు.