Fake News, Telugu
 

ఎలక్ట్రిక్ వాహనాలను స్విట్జర్లాండ్ బ్యాన్ చేయలేదు, కేవలం కొన్ని సందర్భాల్లో పరిమితులు పెట్టేందుకు చూస్తోంది

0

ఎలక్ట్రిక్ వాహనాలను బ్యాన్ చేసిన స్విట్జర్లాండ్”, అని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఎలక్ట్రిక్ వాహనాలను బ్యాన్ చేసిన స్విట్జర్లాండ్. 

ఫాక్ట్: ఎలక్ట్రిక్ వాహనాలను స్విట్జర్లాండ్ బ్యాన్ చేయలేదు. ఈ శీతాకాలంలో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అత్యవసర ప్రతిపాదనలను మాత్రమే రూపొందించింది. ‘Ordinance on Restrictions and Prohibitions on the Use of Electric Energy’ని స్విట్జర్లాండ్ 08 డిసెంబర్ 2022 నాటికి ఇంకా అమలు చేయలేదు. కావున, పోస్ట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను స్విట్జర్లాండ్ బ్యాన్ చేసినట్టు చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. 

పోస్ట్‌లో చెప్పిన విషయం గురించి గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, స్విట్జర్లాండ్ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాన్‌కి సంబంధించి వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి.  స్విట్జర్లాండ్ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాన్‌ చేయలేదని, ఈ శీతాకాలంలో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అత్యవసర ప్రతిపాదనలను మాత్రమే రూపొందించినట్టు ‘మింట్’ అర్టికల్‌లో చదవచ్చు. ఇదే విషయం చెప్తూ ఇతర వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు. 

Ordinance on Restrictions and Prohibitions on the Use of Electric Energy’ని స్విట్జర్లాండ్ 08 డిసెంబర్ 2022 నాటికి ఇంకా అమలు చేయలేదు, కేవలం ముసాయిదాను తయారు చేసి సంప్రదింపులకు పంపించింది.  

అంతేకాదు, ‘Ordinance on Restrictions and Prohibitions on the Use of Electric Energy’ అమలు అయినా, అన్నీ సందర్భాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాన్ అవవు. కేవలం విద్యుత్ కొరత ‘ఎస్కలేషన్ స్టెప్ 3’ స్టేజీకి వచ్చినప్పుడు మాత్రమే, ఇతర వాటితో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా పరిమితులు విధిస్తారు. 

చివరగా, ఎలక్ట్రిక్ వాహనాలను స్విట్జర్లాండ్ బ్యాన్ చేయలేదు, కేవలం కొన్ని సందర్భాల్లో నియంత్రించేందుకు చూస్తుంది. 

Share.

About Author

Comments are closed.

scroll