Fake News, Telugu
 

అది 2018 లో శబరిమల పై న్యూస్ రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు న్యూస్18 బృందం పై జరిగిన దాడి వీడియో

1

‘శబరిమల అయ్యప్పస్వామి వారి ఆలయ ఆచారానికి వ్యతిరేకంగా నిన్న ఆలయ ప్రవేశానికి వెళ్తున్న మహిళను అడ్డుకుట్టున్న అయ్యప్ప స్వామి భక్తులు’ అంటూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నిన్న శబరిమల ఆలయ ప్రవేశానికి వెళ్తున్న మహిళను అడ్డుకుట్టున్న అయ్యప్ప స్వామి భక్తులు.

ఫాక్ట్ (నిజం): అది ఒక పాత వీడియో. గత సంవత్సరం శబరిమల పై న్యూస్ రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు న్యూస్18 సిబ్బందిని కొంత మంది అడ్డుకొని, వారి కారుని ద్వంసం చేసినప్పుడు తీసిన వీడియో అది. కావున పోస్ట్ లో తాజాగా జరిగిన ఘటనగా చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ వీడియో గత సంవత్సరం న్యూస్18 సిబ్బంది పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో అని సెర్చ్ రిజల్ట్స్ ద్వారా తెలుస్తుంది.

గూగుల్ లో ‘News18 attacked sabarimala’ అని సెర్చ్ చేయగా, గత సంవత్సరం జరిగిన ఈ ఘటనపై న్యూస్18 వారు రాసిన న్యూస్ ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. శబరిమల పై న్యూస్ రిపోర్ట్ చేయడానికి పంబ దగ్గరికి వెళ్తున్న రాధిక రామస్వామి అనే న్యూస్18 రిపోర్టర్ ని మరియు కారులో వచ్చిన మిగితా బృందాన్ని కొంత మంది నిలక్కల్ బేస్ క్యాంపు దగ్గర ఆపి, వాళ్ళ కారుని మరియు కెమెరాలను ద్వంసం చేసినట్టుగా ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఈ సంఘటన పై న్యూస్18 వారు చేసిన ట్వీట్లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కావున, గత సంవత్సరం జరిగిన సంఘటనకి సంబంధించిన వీడియో పెట్టి, తాజాగా జరిగినట్టు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా, 2018 లో శబరిమల పై న్యూస్ రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు న్యూస్18 బృందం పై జరిగిన దాడి వీడియో. తాజాగా జరిగిన ఘటన వీడియో కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll