Fake News, Telugu
 

నిజ నిర్ధారణ: 1971 నుండి 2011 కి అస్సాంలో ముస్లిం జనాభా ఎంత పెరిగింది?

0

1971 నుండి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల అస్సాంలో ముస్లిం జనాభా చాలా పెరిగిపోయిందని ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. జనాభా పెరగడానికి ముఖ్య కారణం బంగ్లాదేశ్ నుండి చట్టవిరుద్ధంగా వలస వచ్చిన వాళ్ళను కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిచడమేనని ఆ పోస్ట్ ఉద్దేశం. ఆ పోస్ట్ లో నిజం ఎంత ఉందో విశ్లేషిద్దాం.

క్లెయిమ్ (దావా): అస్సాంలో ముస్లిం జనాభా 1971 లో 12.4 శాతం నుండి 2011 లో 34.22 శాతానికి పెరిగింది.

ఫాక్ట్ (నిజం): 2011 లో అస్సాంలో ముస్లిం జనాభా 34.22 శాతం ఉండడం నిజమే కానీ 1971 లో ముస్లిం జనాభా 12.4 శాతం ఉండడం మాత్రం నిజం కాదు. 1971 సెన్సస్ ప్రకారం 1971 లో అస్సాంలో ముస్లిం జనాభా 24.56 శాతం (పోస్ట్ లో ఇచ్చిన శాతానికి రెండింతలు).

బంగ్లాదేశ్ లో స్వాతంత్రం గురించి జరిగిన పోరాటాలు మరియు తర్వాత జరిగిన యుద్ధం వల్ల చాలా మంది మన దేశానికి వలస వచ్చారు. యుద్ధం నుండి తప్పించుకొని వస్తున్నారు కాబట్టి మన దేశ ప్రభుత్వం కూడా మనవంతు సహాయం చేసింది. పోస్ట్ లో చెప్పినట్టుగా చట్టవిరుద్ధంగా వచ్చేవాళ్ళకు కాకుండా యుద్ధపరిస్థితులను తప్పించుకొని వచ్చే శరణార్థులకు మన ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చింది. దాని వల్ల కొన్ని సమస్యలు వచ్చాయనేది నిజమే కానీ పోస్ట్ లో చెప్పినట్టుగా 1971 నుండి 2011 కి 21.8 శాతం ముస్లిం జనాభా పెరగలేదు. కేవలం 9.7 శాతం పెరిగింది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

Share.

About Author

Comments are closed.

scroll