Fake News, Telugu
 

చిదంబరం తో పాటు ఒకే ఫ్రేమ్ లో ఉన్న వ్యక్తి జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ కాదు

0

‘మిషన్ మోడీ 2019’ అనే ఫేస్బుక్ పేజీ ఒక పోస్ట్ లో ‘ఫోటో లో ఎర్రని వృత్తం లో ఉన్న వ్యక్తి  జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ అని చెప్పింది . మొన్నటి పుల్వామా దాడి లో ఇతను కీలక నిందితుడు .ఇటు పక్కన కూర్చున్నది కాంగ్రెస్ నాయకుడు మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం’ అంటూ పెట్టారు . ఆ పోస్ట్ లో ఎంతవరకు  నిజం ఉందో ఒకసారి విశ్లేషిద్దాం

క్లెయిమ్ (దావా): జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ తో కాంగ్రెస్ నాయకుడు మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఎర్రని వృత్తం లో ఉన్న వ్యక్తి అఫ్గాన్ తాలిబన్ నాయకుడు మరియు పాకిస్థాన్ కి ఆఫ్ఘానిస్తాన్ రాయబారిగా పని చేసిన ముల్లా అబ్దుల్ జాయీఫ్ గా గుర్తించపడ్డాడు. ఆ ఫోటో లో కాంగ్రెస్ నాయకుడు  పి.చిదంబరం కూడా ఉన్నారు. దీనిని ‘తెహెల్క’ మీడియా సంస్థ  గోవాలో నిర్వహించిన  ‘థింక్ఫెస్ట్ 2013’ లో తీశారు. ఈ ఫోటోని  టైమ్స్ నౌ మీడియా సంస్థ తమ అధికారిక ట్విట్టర్ పేజీలో ట్వీట్ కూడా చేసింది

చివరగా, ఆ ఫొటోలో కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం తో పాటు ఒకే ఫ్రేమ్ లో ఉన్న వ్యక్తి  జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ కాదు, తాలిబన్ నాయకుడు మరియు పాకిస్థాన్ కి ఆఫ్ఘానిస్తాన్ రాయబారిగా పని చేసిన ముల్లా అబ్దుల్ జాయీఫ్.

Share.

About Author

Comments are closed.

scroll