Fake News, Telugu
 

100 డాలర్ నోటు పై అంబేద్కర్ చిత్రపటాన్ని అమెరికా ప్రభుత్వం ముద్రించలేదు.

0

అంబేద్కర్ గొప్పతన్నాన్ని గుర్తించిన అమెరికా ప్రభుత్వం, తమ నోట్ల పై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించారని చెప్తూ ఒక ఫోటతో కూడిన పోస్ట్ ని కొందరు ఫేస్బుక్ మరియు వాట్స్ ఆప్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): అంబేద్కర్ చిత్రపటాన్ని అమెరికా ప్రభుత్వం వాళ్ళ 100 డాలర్ నోటు పై ముద్రించారు.

ఫాక్ట్ (నిజం): 100 డాలర్ నోటు పై ఉండే బెంజమిన్ ఫ్రాన్క్లిన్ ఫోటో తీసి అంబేద్కర్ ఫోటో పెట్టారు. ప్రతి 100 డాలర్ పై బెంజమిన్ ఫ్రాన్క్లిన్ న్ని తప్ప ఎప్పుడూ కూడా అంబేద్కర్ చిత్రపటాన్ని అమెరికా ప్రభుత్వం ముద్రించలేదు. కావున పోస్ట్ లో పెట్టింది ఒక ఎడిటెడ్ నోటు.

అమెరికా ప్రభుత్వం ముద్రించే నోట్ల పై వివరాల కోసం గూగుల్ లో వెతకగా, అమెరికా లో ముద్రించే నోట్ల పై అవగాహన కోసం పెట్టిన ఒక వెబ్ సైట్ (‘U.S. Currency Education Programme’) సెర్చ్ రిజల్ట్స్ లో దొరుకుతుంది. ఆ వెబ్ సైట్ ప్రకారం 100 డాలర్ నోట్ డిజైన్ ఇప్పటివరకు నాలుగు రకాలు ఉన్నాయి. అన్ని డిజైన్లల్లో బెంజమిన్ ఫ్రాన్క్లిన్ చిత్రపటమే ఉంటుంది. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా అంబేద్కర్ చిత్రపటాన్ని అమెరికా ప్రభుత్వం తమ 100 డాలర్ నోటు పై ముద్రించలేదని తెలుస్తుంది.

అంబేద్కర్ చిత్రపటమే కాదు మనకు కావాల్సిన వారి ఫోటోలు 100 డాలర్ మీద పెట్టెలా చాలా వెబ్ సైట్లు ఇంటర్నెట్ లో ఉన్నాయి. ఆ వెబ్ సైట్ లల్లో ఉండే 100 డాలర్ నోటు మీద కోడ్ చూస్తే పోస్ట్ లో పెట్టిన నోటు మీద ఉన్న కోడ్ నెంబర్ల తో మ్యాచ్ అవుతాయి. కావున పోస్ట్ లో పెట్టింది కూడా అలా ఎడిట్ చేయబడిన ఫోటోనే.

చివరగా, అంబేద్కర్ చిత్రపటాన్ని 100 డాలర్ నోటు పై అమెరికా ప్రభుత్వం ముద్రించలేదు. అది ఒక ఎడిటెడ్ ఫోటో.

ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll